ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.35
సూర్యాస్తమయం: సాయంత్రం.6.24
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.7.58 ల8.34 మ2.22 ల2.34
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:

ఈరోజు చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి.సంతాన విద్యా ఉద్యోగ విషయాలు నిరాశ కలిగిస్తాయి.ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.మాతృ వర్గీయలతో మాటపట్టింపులు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
వృషభం:

ఈరోజు ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది.
నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి.
వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.నూతన వాహన యోగం ఉన్నది.
మిథునం:

ఈరోజు ధన విషయమై ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా స్థిరత్వం ఉండదు.వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు.ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటకం:

ఈరోజు ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.కుటుంబ వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి.
సింహం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితం ఉండదు.చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.ఇంటా బయట కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
కన్య:

ఈరోజు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి అవుతాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉన్నప్పటికి నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక పరమైన సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు.నూతన కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయి.
తుల:

ఈరోజు సంతాన విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు అమలుచేస్తారు.కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో నిర్ణయాలు కలసి వస్తాయి.వ్యాపారాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం:

ఈరోజు ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు.ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి.వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది.
ధనుస్సు:

ఈరోజు గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.దూర ప్రయాణ సూచనలున్నవి.వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.
మకరం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకొని ముందుకు సాగడం మంచిది.సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
కుంభం:

ఈరోజు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆర్ధిక విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.సహోద్యోగుల ప్రవర్తన వలన మానసిక ఇబ్బందులు తప్పవు.
మీనం:

ఈరోజు ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు.