మొటిమలు అనేవి యుక్త వయస్సులో వస్తాయి.ఇవి మగవారిలోను,ఆడవారిలోను వస్తూ ఉంటాయి.
మొటిమలు కొంత మందికి తక్కువగా వచ్చి తొందరగా తగ్గి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి.కానీ కొంత మందిలో మొటిమలు ఎక్కువగా రావటమే కాకుండా తొందరగా తగ్గకుండా ముఖం మీద చాలా అసహ్యంగా కనిపిస్తాయి.
మొటిమలను తొలగించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలను చేసిన ఎటువంటి ఉపయోగం ఉండదు.అటువంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొటిమలను సులభంగా తగ్గించుకోవచ్చు.
ఇప్పుడు ఆ చిట్కా గురించి తెలుసుకుందాం.
చిట్కాకు కావలసిన పదార్ధాలుEno – 1 పాకెట్రోజ్ వాటర్ – 1 స్పూన్నీమ్ పేస్ వాష్ – 1 స్పూన్
తయారి విధానంఒక బౌల్ లో ENO పొడి, నీమ్ పేస్ వాష్, రోజ్ వాటర్ వేసి మూడు పదార్ధాలు బాగా కలిసేలా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి.ఒక నిమిషం మసాజ్ చేసి పది నిముషాలు ఆలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గుతాయి.అలాగే మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.
ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.