తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ముఖ్యంగా ఎన్టీఆర్( NTR ) లాంటి నటుడు దేవర( Devara ) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఆయన వరుసగా విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ‘త్రిబుల్ ఆర్’( RRR ) సినిమాతో 1300 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు…

ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ తో( Hrithik Roshan ) కలిసి వార్ 2( War 2 ) సినిమాని చేస్తున్నాడు.ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… మరి ఈ సినిమాతో ఆయన మంచి విజయాన్ని సాధిస్తే స్టార్ హీరోగా మారుతాడు.లేకపోతే మాత్రం మరోసారి ఆయన మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా విషయంలో ఆయన ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి వార్ 2 సినిమా విషయంలోనే ఎన్టీఆర్ అభిమానులు కొంతవరకు డౌటుగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఎందుకంటే ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధిస్తుందా లేదా తద్వారా ఈ సినిమాతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… మరి ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.దేవర సినిమాతో వరుసగా 7 విజయాలను అందుకున్న ఆయన వార్ 2 సినిమాతో మరో విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి సక్సెస్ ల పరంపరను కొనసాగిస్తాడా? లేదంటే వాటికి పులిస్టాప్ పెడతాడ అనేది కూడా ఈ సినిమాతో తేలనుంది…








