హీరోయిన్ నేహాశెట్టికు ఉన్న సూపర్ పవర్ ఇదే.. ఎంత తిన్నా అలా కాదంటూ?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నేహాశెట్టి( Neha Shetty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నేహాశెట్టి అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ రాధిక అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.

 Akash Puri About Neha Shetty, Neha Shetty, Akash Puri, Tollywood, Comments Viral-TeluguStop.com

టాలీవుడ్ హీరో విశ్వక్సేన్( Hero Vishvaxen ) హీరోగా నటించిన డీజే టిల్లు మూవీతో భారీగా క్రేజ్ నీ సంపాదించుకుంది నేహా శెట్టి.కుర్రాళ్ళు అందుకే ఈమెను ముద్దుగా రాధిక అని పిలుచుకుంటూ ఉంటారు.

ఆమె ఒరిజినల్ పేరు కంటే ఈ పేరుతోనే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు.ఇలా పిలవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది నేహా శెట్టి.

ఇకపోతే ఈమె మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Telugu Akash Puri, Akashpuri, Neha Shetty, Tollywood-Movie

ఈ సినిమా సరైన సక్సెస్ సాధించకపోయినా తన అందంతో మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ సినిమా తర్వాత వచ్చిన గల్లీ రౌడీ సినిమా( Gully Rowdy movie ) కూడా ఆడలేదు.తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది.ఆ తర్వాత వచ్చిన డీజే టిల్లు సినిమా ఈ ముద్దుగుమ్మకు దిమ్మతిరిగిపోయే సక్సెస్ ఇచ్చిందని చెప్పాలి.2022లో విడుదల అయిన ఈ సినిమాతో రాత్రికి రాత్రే ఈ ముద్దు గుమ్మ ఫేట్ మారిపోయింది.రాధిక పాత్రలో జీవించింది అని చెప్పవచ్చు.ఇదే ఊపులో యంగ్ హీరో కార్తికేయ సరసన బెదురులంక.కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ సినిమాలు చేసింది.కానీ ఆ సినిమాలు సక్సెస్ అవ్వలేదు.

టిల్లు స్క్వేర్‌ లో అతిథి పాత్ర వేసి రాధికగా మళ్లీ రంజింపజేసింది.

Telugu Akash Puri, Akashpuri, Neha Shetty, Tollywood-Movie

ఆ తర్వాత విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా( Gangs of Godavari movie ) నటించగా అది సో సోగా ఆడింది.ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సినిమాలు ఏం లేవు.ఇక సినిమాలన్నీ సంగతి పక్కనపెడితే సోషల్ మీడియాలో అమ్మడి ఫోటోల రచ్చ మాములుగా ఉండదని చెప్పాలి.

ఇది ఇలా ఉంటే నేహా శెట్టి గురించి తాజాగా హీరో ఆకాష్ పూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఒక చిన్న చిట్ చాట్ షోలో తన నటించిన కొంతమంది హీరోయిన్ల గురించి క్రేజీ కామెంట్లు చేశాడు.

ముందుగా నేహా శెట్టి గురించి స్పందిస్తూ.నేహా శెట్టిలో ఉన్న ఒక క్రేజి థింగ్ ఏంటి అంటే.

ఆమెకు ఒక సూపర్ పవర్ ఉంది.ఆమె ఎంత తిన్నా కూడా లావు కాదు.

కానీ నిజంగా అది గాడ్ గిఫ్ట్ అని ఆకాష్ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆకాష్ పూరి చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ అవ్వడంతో నిజమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రాధికా ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube