కట్నం తక్కువైందని పెళ్లి ఆగిపోవడం వినుంటారూ.లేదంటే మగపెళ్లివారికి మర్యాదలో లోటు జరిగిందని పెళ్లి ఆగిపోయిందని వినుంటారూ కానీ పూలు మారాయని పెళ్లి ఆగిపోవడం గురించి ఎక్కడయినా విన్నారా.
వినుండరు కదా బట్ పెళ్లికూతురు మల్లెపూలకు బదులు కాగడాలు పెట్టుకొచ్చిందని పెళ్లి ఆగిపోయింది.మీరు చదివింది అక్షరాలా నిజం.
అయినా పెళ్లికూతురు కావాలి కానీ పూలతో పనేంటో నాకైతే అర్దం కాలేదు.ఇంతకీ ఇంతటి ఫన్నీ పెళ్లి క్యాన్సిల్ ఎక్కడో తెలుసా.
ఫన్నీ అని ఎందుకన్నాను అంటే పూలు మారాయని పెళ్లి క్యాన్సిల్ అనగానే అమ్మాయి వాళ్లు ఏడుస్తూ కూర్చోలేదు.అదే టైంకి వేరే పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేసేసారు.
బెంగళూరులోని హొసకోటె తాలూకాలో చిక్కనహళ్లి గ్రామానికి చెందిన ఆనంద్‌కు విజయపుర పట్టణానికి చెందిన యువతితో భీమాకనహళ్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో వివాహం నిశ్చయించారు.వివాహ పనులు ప్రారంభమైన కాసేపటికి వధువు పెళ్లి మండపంలోకి అడుగుపెడుతుండగా వధువు జడ అలంకారం విషయమై వధూవరుల కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.
మల్లెపువ్వులతో కాకుండా కాగడా మల్లెలతో వధువు జడను అలంకరించారంటూ వరుడు కుటుంబ సభ్యులు వాగ్వాదం చేయగా.సమయానికి మల్లెపువ్వులు లభించకపోవడంతో కాగడాలతో అలంకరించాల్సివచ్చిందంటూ వధువు కుటుంబ సభ్యులు నచ్చచెప్పసాగారు.