బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోండి!

ఇటీవల రోజుల్లో అధిక బరువు అనేది కోట్లాది మందికి అతి పెద్ద శత్రువు గా మారింది.ప్రపంచవ్యాప్తంగా ఎందరో మంది అధిక బరువు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.

 Best Way To Drink Green Tea For Quick Weight Loss! Green Tea, Green Tea Benefits-TeluguStop.com

అధిక బరువును నిర్లక్ష్యం చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అలాగే ఇరుగుపొరుగు వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ మరింత ఇబ్బంది పెడతాయి.

ఈ క్ర‌మంలోనే బరువు తగ్గడం కోసం ఎక్కువ శాతం మంది ప్రయత్నిస్తుంటారు.అయితే వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ తమ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటారు.

బరువు తగ్గడానికి గ్రీన్ టీ( Green tea ) ఉపయోగపడుతుంది.ఇక్క‌డ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా గ్రీన్ టీను తీసుకుంటే మరింత వేగంగా బరువు తగ్గుతారు.అదే సమయంలో మరెన్నో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి లేటెందుకు త్వరగా బరువు తగ్గడానికి గ్రీన్ టీను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Green Tea, Tips, Latest-Telugu Health

ముందుగా ఒక జార్ తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ), మూడు నుంచి నాలుగు లెమన్ స్లైసెస్ వేసుకోవాలి.ఆ తర్వాత రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ తో పాటు రెండు గ్లాసులు బాగా మరిగించిన వాటర్ పోసి స్పూన్ తో కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై స్టైనర్ సహాయంతో ఈ గ్రీన్ టీను ఫిల్టర్ చేసుకుని తేనె కలిపి సేవించాలి.

Telugu Green Tea, Tips, Latest-Telugu Health

ఈ విధంగా గ్రీన్ టీ తీసుకుంటే మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దీంతో క్యాలరీలు కరిగే వేగం పెరిగి సూపర్ ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.అంతేకాదు ఇప్పుడు చెప్పిన పద్ధతిలో గ్రీన్ టీ తాగితే లివ‌ర్ శుభ్రంగా( Liver ), ఆరోగ్యంగా మారుతుంది.బాడీలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు తొలిగిపోతాయి.

బాడీ డిటాక్స్ అవుతుంది.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

జలుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఉంటే దూరమవుతాయి.మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పరార్ అవుతాయి.ఈ విధంగా గ్రీన్ టీ తాగితే మోకాళ్ళ నొప్పుల నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube