గొంతు మంటతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ ఇంటి చిట్కాలు మీకే!

గొంతు మంట‌తో ( sore throat )బాధ‌ప‌డుతున్నారా? ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాలో అర్థం కావ‌డం లేదా? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.గొంతు మంట‌కు అనేక అంశాలు కార‌ణం అవుతాయి.

 These Home Remedies Give Relief From Burning Throat! Home Remedies, Burning Thro-TeluguStop.com

ప్ర‌ధానంగా అలర్జీలు, సాధారణ జలుబు మ‌రియు ఫ్లూ, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రిక్ సమస్యలు, పొల్యూషన్, చల్లటి లేదా పొడి వాతావరణం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, పొగత్రాగటం, మద్యం సేవించడం, స్ట్రెస్ వంటి కారణాల వ‌ల్ల గొంతులో గంద‌ర‌గోళం ఏర్ప‌డి మంటను అనుభ‌వించ‌వ‌చ్చు.

అయితే సాధార‌ణ గొంతు మంట‌ను కొన్ని ఇంటి చిట్కాల‌తో సుల‌భంగా వ‌దిలించుకోవ‌చ్చు.

తేనె( Honey ) మ‌రియు లెమన్( Lemon ) కాంబినేష‌న్ గొంతు మంట నుంచి వేగంగా ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.ఒక టేబుల్ స్పూన్ తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవాలి.

తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్( Anti bacterial ) లక్షణాలు, నిమ్మ‌ర‌సంలోని శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు గొంతు మంటను తగ్గిస్తాయి.

Telugu Throat, Tips, Latest, Simple Tips, Give Throat-Telugu Health

అల్లం కషాయం గొంతు మంట, జలుబు, దగ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను తగ్గించడంలో చాలా ఉత్తంగా స‌హాయ‌ప‌డుతుంది.ఒక గ్లాస్ వాట‌ర్ లో వ‌న్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం త‌రుము( fresh ginger ), చిటికెడు ప‌సుపు, అంగుళం దాల్చిన వేసి బాగా మ‌రిగించాలి.ఇలా మ‌రిగించిన నీటిని ఫిల్ట‌ర్ చేసుకుని తేనె క‌లిపి తాగేడ‌మే.

రోజుకు ఒక‌సారి ఈ అల్లం క‌షాయం తాగితే గొంత మంట దెబ్బ‌కు దూరం అవుతుంది.అల్లం క‌షాయానికి బ‌దులుగా మీరు గ్రీన్ టీను( Green tea )తీసుకుని మంచి ఫ‌లితం ఉంటుంది.

Telugu Throat, Tips, Latest, Simple Tips, Give Throat-Telugu Health

గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి రోజుకు రెండు నుంచి మూడు సార్లు గార్గిల్ చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ఇన్ఫెక్షన్ త‌గ్గి గొంతు మంట దూరం అవుతుంది.ఇక డీహైడ్రేషన్ వల్ల గొంతు మరింత మంటగా అనిపించవచ్చు, కాబట్టి తగినన్ని నీళ్లు తాగాలి.క్కువ మిరియాలు, కారంగా ఉండే ఆహారాన్ని ఎవైడ్ చేయాలి.ధూమ‌పానం, మద్య‌పానం అల‌వాట్ల‌ను మానుకోవాలి.అప్పుడే గొంత మంట నుంచి త్వ‌ర‌గా రిలీఫ్ పొంద‌గ‌లుగుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube