సినిమా నటులు అంటేనే పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోవాలి.ఏ క్యారెక్టర్ చేసినా శక్తి వంచన లేకుండా ఫర్ఫామెన్స్ చూపించాలి.
అప్పుడే తమ పాత్రకు న్యాయం చేయగలుగుతారు.కొందరు నటులు మరో అడుగు ముందుకు వేసి తమకు రాకపోయినా కొన్ని విషయాలు నేర్చుకుని మరీ సినిమాల్లో నటించారు.
పలు సాహసాల్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.తాజాగా పలువురు ఆర్టిస్టులు డిమాండ్ మేరకు గుర్రపు స్వారీ నేర్చుకున్నారు.
అద్భుతంగా నటించారు.ప్రేక్షకుల చేత వారెవ్వా అనిపించారు.
ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
బాలకృష్ణనందమూరి నట సింహం ఇప్పటికే పలు సినిమాల్లో గుర్రపు స్వారీ చేశాడు.
లెంజెండ్, పాండురంగడు సినిమాల్లోనూ గుర్రాలతో ఆడుకున్నాడు.తాజాగా ఆయన నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీలో ట్రైనింగ్ తీసుకున్నాడు.
చిరంజీవి
పలు సినిమాల్లో గుర్రపు స్వారీ చేసిన హీరో చిరంజీవి. కొండవీటి దొంగ, కొదమ సింహం సినిమాల్లో చిరంజీవి అద్భుతంగా నటించారు.సినిమాల్లో నటించడం కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్న తొలి హీరోగా ఆయన రికార్డు సృష్టించాడు.
ప్రభాస్

బాహుబలి సినిమాలో కత్తిసాము, గుర్రపు స్వారీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రభాస్ ఇందుకోసం చాలా కష్టపడ్డాడు.నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకున్నాడు.
చక్కటి ప్రతిభతో యాక్షన్ సీన్లలో హైలెట్ గా నిలిచాడు.
తమన్నా

ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ మూవీ బాహుబలి కోసం తమన్నా సైతం గుర్రపు స్వారీ నేర్చుకుంది.అవంతిక పాత్రలో గుర్రంపై పరిగెడుతూ అదంరినీ ఆకట్టుకుంది.
రాంచరణ్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా కోసం ప్రత్యేకంగా హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు ఈ మెగా హీరో.
అల్లు అర్జున్బద్రీనాథ్, రుద్రమదేవి సినిమాల్లో హార్స్ రైడింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్.గుర్రపు స్వారీ ట్రైనింగ్ కోసం సుమారు 2 నెలలు కష్టపడ్డాడు.
అనుష్క

నిజానికి అనుష్కకు గుర్రాలంటే భయం.కానీ రుద్రమదేవి సినిమా కోసం సుమారు 2నెలల పాటు కష్టపడి శిక్షణ తీసుకుంది.
మహేష్ బాబు

టక్కరి దొంగ సినిమా కోసం మహేష్ బాబు 2 వారాలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.కౌబాయ్ క్యారెక్టర్ చేసి వారెవ్వా అనిపించాడు.