ఉడికించిన క్యారెట్ వ‌ర్సెస్ ప‌చ్చి క్యారెట్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్‌?

క్యారెట్‌( Carrot ).ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే కూర‌గాయ‌ల్లో ఒక‌టి.

 Cooked Carrot Vs Raw Carrot Which Is Better For Health? Cooked Carrot, Raw Carro-TeluguStop.com

క్యారెట్ తక్కువ కేలరీలతో, అధిక పోషకాలు కలిగి ఉంటుంది.విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ క్యారెట్ లో మెండుగా నిండి ఉంటాయి.

అంద‌కే దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లో క్యారెట్ ను విరివిగా ఉప‌యోగిస్తారు.క్యారెట్ ను కొంద‌రు ప‌చ్చిగా తింటే.

మ‌రికొంద‌రు ఉడికించి తింటారు.అయితే ఉడికించిన క్యారెట్ మ‌రియు ప‌చ్చి క్యారెట్‌ల‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అనే డౌట్ చాలా మందికి ఉంది.

నిజానికి రెండింటికీ ఆరోగ్యపరంగా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.ఏది బెస్ట్ అనేది మీ ఆరోగ్య అవసరాలపై ఆధారపడి ఉంటుంది.ఉడికించిన క్యారెట్‌లో బీటా-కెరోటిన్( Beta-carotene ) శరీరానికి మెరుగైన రీతిలో శోషించబడుతుంది.కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచ‌డంలో బీటా-కెరోటిన్ ముఖ్య పాత్ర‌ను పోషిస్తుంది.

అలాగే ఉడికించడం ద్వారా పచ్చి క్యారెట్‌లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాలను తొలగించవచ్చు.చిన్నపిల్లలు, వృద్ధులు మ‌రియు దంతాల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఉడికించిన క్యారెట్ ( Boiled carrot )ను తేలికగా తినగలగుతారు.

Telugu Carrot, Carrot Benefits, Cookedcarrot, Tips, Latest, Raw Carrot-Telugu He

ప‌చ్చి క్యారెట్ విష‌యానికి వ‌స్తే.ఇందులో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్( Dietary fiber ) ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.తక్కువ కేలరీలు ఉండ‌టం వ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌ని భావిస్తున్న‌వారికి ముడి క్యారెట్ ఆరోగ్యకరమైన స్నాకింగ్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.అలాగే ప‌చ్చి క్యారెట్ లో విటమిన్ సి, పొటాషియం( Vitamin C, potassium ) మ‌రియు ఇత‌ర విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి.

ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తాయి.రక్తపోటును నియంత్రించడంలో, శరీరంలో టాక్సిన్స్ తొలగించ‌డంలో తోడ్ప‌డ‌తాయి.

Telugu Carrot, Carrot Benefits, Cookedcarrot, Tips, Latest, Raw Carrot-Telugu He

ఇక ఫైన‌ల్ గా చెప్పేది ఏంటంటే.ఉడికించిన క్యారెట్ మ‌రియు ప‌చ్చి క్యారెట్ రెండు ఆరోగ్య‌క‌ర‌మే.శ‌రీరంలో విటమిన్ ఎ శోషణ పెరగాలని భావించేవారు, మృదువైన టెక్చర్ ను కావాల‌ని కోరుకునేవారు ఉడికించిన క్యారెట్ ను ఎంపిక చేసుకోవ‌చ్చు.శరీరానికి ఎక్కువ ఫైబర్, తక్కువ ప్రాసెసింగ్ ఉన్న ఆహారం కావాలనుకుంటే పచ్చి క్యారెట్ మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube