ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ చివరికి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే చూశాము.ముఖ్యంగా రోడ్డుపై కొందరు యువత చేసే డేంజర్ స్టంట్స్( Dangerous Stunts ) కారణంగా అనేకమంది వికలాంగులు కాగా.
మరికొందరు ఏకంగా ప్రాణాలను కోల్పోయారు.ముఖ్యంగా రోడ్డుపై ప్రయాణం చేసిన సమయంలో బైకులను ఇష్టానుసారంగా నడుపుతూ ప్రమాదాలకు గురవడం, లేకపోతే రైల్లో ప్రయాణం చేస్తున్న సమయంలో కొందరు అతి ఉత్సాహం చూపించి చివరికి పైకి ఎక్కి కరెంటు వైర్లను తాకే ప్రాణాలను కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారు.
తాజాగా ఇలాంటి షాకింగ్ ఘ్తనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వైరల్ వీడియోకు( Viral Video ) సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
చైనా దేశానికి చెందిన యువతీ శ్రీలంక దేశంలో( Srilanka ) ఉన్న కొలంబో లో రైలులో( Train ) ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా చెట్టును ఢీకొని కిందపడిపోయింది.ఈ విషయం జరిగి కొద్ది కాలం గడుస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.చైనా అమ్మాయి( Chinese Girl ) రైలు గేటు వద్ద నిలబడి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలో ఫోటోలు తీసుకోవడానికి రైలు డోర్ ఎంట్రీ వద్ద కాస్త వంగి ఫోటోలకు ఫోజు ఇచ్చింది.అయితే, ఇలా చేయడం వల్ల ఆ యువతి రైలు నుంచి బయటకు వంగి ఉన్న సమయంలో ఓ చెట్టు కొమ్మ తగిలి కదులుతున్న రైలు నుంచి అలాగే కింద పడిపోయింది.
ఆ సమయంలో ఫోటోలను తీసిన స్నేహితురాలు వీడియో రూపంలో రికార్డు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.ఇకపోతే చైనా అమ్మాయి ఆమె స్నేహితురాలు శ్రీలంకలోని కొన్ని పర్యాటక ప్రదేశాలను చూడడానికి వచ్చారు.ఈ సమయంలో వెల్లవట్టే నుంచి బంబలపిటియాకు వెళ్లే రైలులో ప్రయాణం చేసిన సమయంలో ఈ సంఘటన జరిగింది.అయితే ఇంత పెద్ద ఘటన జరిగిన ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది.
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రైలు ప్రయాణం చేసే సమయంలో ఇలాంటి పనికిమాలిన పనులు మానుకోవాలని కామెంట్ చేస్తున్నారు.