ఈరోజుల్లో అనేక సరికొత్త రోబోలు మన జీవితంలోకి వస్తున్నాయి. ఫ్యాక్టరీల నుంచి ఆసుపత్రుల(From factories to hospitals) వరకు, రోడ్ల మీద నుంచి పాఠశాలల వరకు, ప్రతిచోటా రోబోలు పని చేస్తున్నాయి.
ఈ రోబోలు మన జీవితాన్ని చాలా సులభతరం చేస్తున్నాయి.ఉదాహరణకి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌లో రోబోలు పెద్ద పెద్ద వస్తువులను తరలిస్తాయి.
ఆసుపత్రుల్లో రోబోలు మనకు మందులు ఇస్తాయి.చికిత్స కూడా చేస్తాయి.
ఇలా రోబోలు మనకు చాలా పనుల్లో సహాయం చేస్తున్నాయి.
అయితే ఇప్పుడు చైనా దేశం ఒక కొత్త రోబోని తయారు చేసింది.
దాని పేరు RT-G.ఈ రోబో చాలా స్మార్ట్‌గా ఉంటుంది.ఇది ఒక బంతిలా ఉంటుంది.దీనిని లాగోన్ టెక్నాలజీ అనే సంస్థ తయారు చేసింది.ఈ RT-G రోబో మనకు సహాయం చేయడమే కాకుండా, క్రిమినల్స్(Criminals) ను వెంటాడి మరీ పట్టుకుంటుంది.ఇది రోడ్ల మీద తిరుగుతూ చుట్టూ ఉన్న వాళ్లందరినీ జాగ్రత్తగా గమనిస్తుంది.
ఎవరైనా దొంగతనం(Theft) చేస్తున్నారా లేదా ఏదైనా అనుమానాస్పదమైన పని చేస్తున్నారా అని చూస్తుంది.
ఈ రోబో చాలా బలంగా ఉంటుంది.ఇది భూమి మీద మాత్రమే కాకుండా నీళ్లలో కూడా ప్రయాణిస్తూ ఎన్నో ప్రాంతాలను కవర్ చేయగలదు.ఇది చాలా వేగంగా కూడా తిరుగుతుంది.
గంటకు 35 కిలోమీటర్ల (35 kilometers per hour)వేగంతో వెళ్లగలదు.అంతేకాదు, ఎన్ని పడిపోయినా, ఎంత బలంగా గుద్దినా దీనికి ఏమీ కాదు.
ఈ రోబోలో చాలా స్పెషల్ ఫీచర్లు, సెన్సార్లు ఉన్నాయి.ఆ స్పెషల్ ఫీచర్లతో ఇది అచ్చం హ్యూమన్ పోలీస్ లాగానే పని చేస్తుంది.
ఈ రోబోకి ఏదైనా అగ్ని ప్రమాదం కనిపిస్తే వెంటనే అగ్నిమాపక దళం వాళ్లకి లేదా పోలీసులకి సమాచారం ఇస్తుంది.అవసరమైతే స్వయంగానే ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తుంది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.ఈ వీడియోలో ఈ రోబో పోలీసుల మధ్య దానంతటదే వెళ్తూ ఉండటం కనిపించింది అది అటు ఇటు వంగుతూ అన్ని పరిసరాలను గమనిస్తున్నట్లుగా కనిపించింది.
అంతే కాదు దాని చుట్టూ రెండు లైట్లు కూడా వెలుగుతూ మలుగుతూ ఉన్నాయి.
ఈ రోబోకి చాలా ప్రత్యేకమైన ఆయుధాలు ఉన్నాయి.కానీ అది ఎవరినీ గాయపరచదు.దీనిలో జాలి వేసి పట్టే గన్నులు ఉన్నాయి.
ఈ గన్‌ల నుంచి వెళ్ళే జాలి వలతో దొంగలను పట్టుకోవచ్చు.అలాగే, టీయర్ గ్యాస్ స్ప్రేయర్లు కూడా ఉన్నాయి.
అవసరమైతే దొంగలను పట్టుకోవడానికి ఈ స్ప్రేయర్‌ని ఉపయోగించవచ్చు.అంతేకాదు, పెద్ద శబ్దాలను చేసే పరికరాలు కూడా ఉన్నాయి.
ఈ శబ్దాల వల్ల దొంగలు భయపడి పారిపోతారు.ఈ రోబోని ఉపయోగించడం వల్ల చైనా దేశంలో చాలా సేఫ్టీ పెరుగుతుంది.
ఇది పోలీసులకు చాలా సహాయం చేస్తుంది.భవిష్యత్తులో చైనా ప్రజలు పోలీసు స్టేషన్‌కి వెళ్లకుండానే ఈ రోబోల సహాయంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చేమో!
.