సినిమా పేర్లు వినగానే ఆకట్టుకోవాలి.టైటిల్ భలే ఉందిరా అనుకోవాలి.
సినిమా విజయంలో టైటిల్ కూడా కీరోల్ పోషిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.అందుకే దర్శకనిర్మాతలు ఏరికోరి మరీ సినిమా పేర్లు పెడతారు.
డిఫరెంట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.ఊర్ల పేర్లతో వచ్చి మంచి విజయం సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
ఇంతకీ అలా వచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!
1.బొంబాయి
బొంబాయిలో జరిగిన కమ్యునల్ వాయిలెన్స్ ఈ సినిమా స్టోరీ.ఇరు వర్గాల మధ్య జరగిన గొడవలు, రక్తపాతం, ఆస్తి, ప్రాణనష్టాలను ఈ సినిమాలో చూపించారు.మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అదే సిటీ పేరు పెట్టారు.
ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇందులో పాటలు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటాయి.
2.అరుణాచలం
సౌత్ ఇండియాన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరెక్కిన సినిమా అరుణాచలం.ఆయన కెరీర్‌లో ఇదో మైల్ స్టోన్.తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం.
ఇందులో హీరో పేరు సైతం అరుణాచలం.ఊరిపేరుతో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
3.భద్రాచాలం
రియల్ స్టార్ శ్రీహరి హీరోగా ఈ సినిమా రూపొందింది.ఎన్ శంకర్ దర్శకుడు.ఈ సినిమాలో హీరో పేరు భద్రాచాలం.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఈ భద్రాచలం అనే పుణ్యక్షేత్రం ఉంది.శ్రీరాముడు నడయాడిన నేలగా ఈప్రాంతానికి గుర్తింపు ఉంది.ఈ సినిమా సైతం మంచి హిట్ అందుకుంది.
4.అనంతపురం
ఏపీలోని ఓ జిల్లాపేరు అనంతపురం.ఫ్యాక్షన్ సినిమాల గురించి వినగానే అనంతపురం గుర్తుకు వస్తుంది.ఈ ఊరిపేరును తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ చేసిన చిత్రానికి పెట్టారు.ఈ మూవీ కూడా హిట్ అయ్యింది.
5.హనుమాన్ జంక్షన్
ఏలూరు దగ్గర హనుమాన్ జంక్షన్ అనేది చాలా ఫేమస్ ఏరియా.ఈ పట్టణం పేరుతో జగపతి బాబు, అర్జున్, వేణు హీరోలుగా సినిమా తీశారు.చక్కటి కథతో తెరెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.
6.భీమిలి
నేచురల్ స్టార్ నాని హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.కబడ్డి నేపథ్యంలో ఈ సినిమా తీశారు.ఇందులో నాని కబడ్డి టీం భీమిలికి చెందినది కావడంతో సినిమా పేరు సైతం భీమిలిగా పెట్టారు.ఈ సినిమా సైతం హిట్ అందుకుంది.
7.కేరాఫ్ కంచరపాలెం
వెంకట్ దర్శకత్వంలో చక్కటి కథతో ఈ సినిమా రూపొందింది.తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమా తీశారు.కంచరపాలెంలో తీసిని ఈ చిత్రానికి అదే పేరు ఫిక్స్ చేశారు.ఈ సినిమా కూడా మంచి ప్రేక్షక ఆదరణ పొందింది.
8.అన్నవరం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఈ సినిమా తీశారు.చెల్లికి తోడుగా ఉండే అన్నయ్య క్యారెక్టర్‌లో పవన్ నటించాడు.ఈ మూవీలో పవన్ పేరు అన్నవరం.
ఇదే పేరుతో ఆంధ్రాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది.దీంతో ఈ సినిమాకు అన్నవరం అనే పేరును ఖాయం చేశారు.
9.గంగోత్రి
అల్లూ అర్జున్ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా ఇది.రాఘవేంద్ర రావు దర్శకుడు.గంగోత్రి పరిసరాల్లో ఈ సినిమా నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు.
అంతేకాదు.ఈ సినిమాలో హీరోయిన్ పేరు కూడా గంగోత్రి కావడం విశేషం.
అటు మరికొన్ని సినిమాలు సైతం ఊరిపేర్లతో ఉన్నా అంతా విజయం సాధింలేదు.