భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది.సినిమా రాజకీయ క్రీడా వంటి పలు రంగాల్లో ప్రముఖులుగా కొనసాగుతున్న సెలబ్రిటీలు బయట ప్రదేశాల్లో తిరగడం వల్ల వారికి కరోనా వైరస్ సంక్రమిస్తుంది.
క్రీడాకారులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు.గతేడాది ప్రముఖ బ్యాట్మెంటన్ ప్లేయర్ లు కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఏడాది క్రికెటర్లపై కరోనా వైరస్ కోరలు చాస్తోంది.ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు.
ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఆయన సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కు కూడా కరోనా వైరస్ సోకింది.ఇంకా ఇతర దేశాల క్రికెటర్లు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు.

అయితే తాజాగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు.తీవ్రమైన జ్వరం రావడంతో ఆమె సోమవారం రోజు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.అయితే పరీక్షలలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.దీంతో ఆమె హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారని సన్నిహితులు చెబుతున్నారు.అయితే ఆమె స్వల్ప లక్షణాలతోనే బాధపడుతున్నారని త్వరలోనే కరోనా వైరస్ ని జయించి మళ్లీ కోలుకుంటారని తెలుస్తోంది.అయితే హర్మన్‌ప్రీత్ కౌర్ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ క్రికెట్ లో ఆడాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం స్వదేశం లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో హర్మన్‌ప్రీత్ ఆడారు.ఆమె ఐదు వన్డే మ్యాచులలో 160 పరుగులు చేశారు.
అయితే ఈ వన్డే సిరీస్ లో భారత దేశం కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.ఐదవ వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలో హర్మన్‌ప్రీత్ గాయపడ్డారు.
దీంతో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ మ్యాచ్ లలో ఆమె పాల్గొనలేక పోయారు.