మూత్రం ఆపి ఉంచడం వలన జరిగే 5 అనర్థాలు  

5 Reasons Why You Should Not Stop Your Pee -

మూత్ర విసర్జన ఎప్పుడు చేస్తాం? మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే చేయలేం కదా? అది ఎప్పుడు వస్తే అప్పుడే విసర్జన చేసేది.ఓ టైమ్ ఉండదు, ప్లేసు ఉండదు.

ఎప్పుడు వస్తుందో చెప్పలేం.ఓరకంగా చెప్పాలంటే, మన శరీరానికి సంబంధించిందే అయినా, మన కంట్రోల్ లో ఉండని విషయం ఇది.మన అదుపులో పెట్టుకోలేకపోవచ్చు కాని, వచ్చినప్పుడు బయటకితోయడం మాత్రం చేయవచ్చు.అసలు మూత్రం ఎందుకు వస్తుంది? దానితో మన శరీరానికి పని ఏంటి ?

TeluguStop.com - 5 Reasons Why You Should Not Stop Your Pee-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఒంట్లో ఉన్న మలీనాల్ని కడిగి తనతోపాటు బయటకితీసుకెళ్ళే ద్రవపదార్థమే మూత్రం.అంటే మన ఒంటిలోని చెత్తను బయటకితీస్తుంది.మరి చెత్త ఎప్పటికప్పుడు బయటకితీయాలి కాని ఆపిపెడితే ఎలా ? కొందరికి కాదు, చాలామందికి మూత్రాన్ని ఆపివేసి ఉంచే అలవాటు ఉంటుంది.థియేటర్లో కూర్చుంటారు .కాని ఒక్క సీన్ ఎక్కడ మిస్ అయిపోతుందో అని విరామం దాకా ఆపుకుంటారు.నిద్రలోకి కాస్త అనిపిస్తుంది .కాని బద్దకంకొద్దీ అప్పుడే లేచి మూత్ర విసర్జన చేయరు.ఇది మంచి అలవాటు కాదు.దీనివలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా ? మీరే చూడండి.

#1) బ్లాడర్ మీద ఒత్తిడి :

మన మూత్రం శరీరంలోని టాక్సిన్స్, మలీనాల్ని సాధ్యమైనంతవరకు క్లీన్ చేస్తుంది.ఇది కొడ్నిల్లోంచి బ్లాడర్ లోకి వెళుతుంది.

మన బ్లాడర్ ఎప్పుడు కూడా ఫుల్ అయితేనే మూత్రాన్ని బయటకి తోయమని ఫోర్స్ చేస్తుంది.అంతే తప్ప ఇష్టం వచ్చినప్పుడు బయటకి తోసే ప్రయత్నం చేయదు.

మూత్రం వస్తోందన్నట్లు అనిపిస్తేనే అర్థం చేసుకోవాలి బ్లాడర్ ఫుల్ అయిపోతుంది, దాన్ని ఖాలీ చేయాలి అని.నార్మల్ గా, మనుషుల బ్లాడర్ 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల దాకా మూత్రాన్ని ఉంచుకోగలదు.ఆ లిమిట్ దాటిన క్షణం నుంచే బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది.అక్కడినుంచి మీరు ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి.అయినా మూత్రాన్ని ఆపాల్సినంత పని ఏముంటుంది ? మన శరీరం కోసం ఓ రెండు నిమిషాలు కేటాయించటం అంత కష్టమా? ఆఫీసు మీటింగుల ఉన్నాసరే, ఒక్కనిమిచం పర్మీషన్ అడిగి, ఒకే నిముషంలో పని పూర్తిచేసుకోవచ్చు.కాబట్టి బ్లాడర్ మీద ఒత్తిడి పెంచే పనలు చేయవద్దు.

అలా చేస్తే ఏమవుతుందో, ఎన్ని అనర్థాలు జరుగుతాయో .తరువాతి పాయింట్స్ లో చూడండి.

#2) బ్లాడర్ పెద్దగా అవడం మంచిది కాదు:

మన బ్లాడర్ ఇంతకుముందు చెప్పినట్లుగా 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల మూత్రాన్ని మోయగలదు.ఆ లిమిట్ దాటితే బ్లాడర్ మన మెదడుకి సంకేతాలు పంపుతుంది.

అప్పుడే మనకు మూత్ర విసర్జన చేయాలన్న జ్ఞానం కలుగుతుంది.మరి మెదడు చెప్పిన మాట వినాలి కదా? వినకపోతే ఎక్కువ మూత్రాన్ని ఆపేందుకు బ్లాడర్ పరిమాణంలో ఇంకొద్దిగా పెరుగుతుంది.ఇలా పెరగడం మంచిదేమో అనుకుంటున్నారా? కాదు, కాదు … అస్సలు కాదు.ఇలా సైజులో మార్పులు రావడం వలన మెదడుకి బ్లాడర్ నుంచి సంకేతాలు తక్కువగా అందుతాయి.

దాంతో మూత్ర విసర్జన జరగాల్సిన సమయంలో జరగకపోవచ్చు.ఇలా చేయడం వలన మలీనాలయ ఎక్కువసేపు అలానే ఉండిపోతాయి.

దాంతో బ్లాడర్ మీద ఒత్తిడి మరింత పెరిగిపోతుంది.ఒత్తిడి పెరిగితే ఏం అవుతుందో తెలుసా? సంకేతాలు త్వరగా అందకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?

#3) కిడ్నీల్లో రాళ్ళు :

కిడ్నీల్లో రాళ్ళు .ప్రపంచవ్యాప్తంగా లక్షలమందిని పలకరిస్తున్న సమస్య ఇది.ఇంతమందికి ఊరికే వస్తోందా ఈ ప్రాబ్లం? ఇంతమందిలో ఎంతమందికి మూత్రాన్ని ఆపి ఉంచే అలవాటు ఉంటుందో కదా! మూత్రాన్ని ఆపి ఉంచడం వలన మూత్రంలోని కొన్ని పదార్థాలు స్టికిగా మారతాయి.అంటే బంకలా అనుకోండి .ఇవే మెల్లిమెల్లిగా రాళ్ళుగా మారతాయి.ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తూ ఉంటే, అవి ఇంకా బంకగా మారి, ఇంకా పెద్ద రాళ్లు వస్తాయి.ఇలా క్రమంగా రాళ్ళు పెరిగిపోతూనే ఉంటాయి.కిడ్నీల్లో రాళ్ళు స్త్రీ పురుషులిద్దరికి వస్తాయి.కాని మూత్రాన్ని ఆపుకోవడం వలన వచ్చే ఛాన్స్ మహిళల్లోనే ఎక్కువ అంట.అలా ఎందుకో వేరే చెప్పాలా? పురుషుల మాదిరి ఎక్కడపడితే అక్కడ మహిళలు మూత్రాన్ని విసర్జించలేరు.అలా ఆపి పట్టే అలవాటు వారిలో ఎక్కువగా ఉండటం ఇలా జరుగుతుందని డాక్టర్ల చెబుతున్నారు.

#4) యూరినరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్స్ :

ఇందాకా చెప్పినట్లు, పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా మూత్రాన్ని ఆపి ఉంచుకుంటారు.స్త్రీ సామాజిక ఇబ్బందులు స్త్రీలవి.

కాని సైన్స్ కి అవన్ని తెలియవు .లాభమైతే లాభం అని చెబుతుంది, నష్టమైతే నష్టమని చెబుతుంది.ఈ మూత్రాన్ని ఆపి ఉంచే అలవాటు వలన వచ్చే మరో సమస్య యూరీనరి ట్రాక్ట్ ఇంఫెక్షన్.వీటినే UTIs అని అంటారు.ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ అంట.కారణం మీకు తెలిసిందే.

ఈరకమైన ఇంఫెక్షన్ వచ్చిందనుకోండి, మాటిమాటికి మూత్రం వస్తుంది, మూత్రంలో మంటగా ఉంటుంది, ఒక్కోసారి బ్లాడర్ ఖలీగా ఉన్నా మూత్రం వచ్చినట్లుగా అనిపిస్తుంది.అదే తీవ్రమైన సమస్య.ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా పడుతుంది.జ్వరం, వెన్నునొప్పి, పురుషుల్లో అంగం మీద స్థలంలో నొప్పి .ఇలాంటి సమస్యలు ఎన్నోవస్తాయి.అటుచేసి ఇటుచేసి మీ కిడ్ని ప్రమాదంలో పడుతుంది.

మిమ్మల్ని చావుకి దగ్గర చేస్తుంది.

#5) కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ :

మూత్రాన్ని అలాగే ఆపి పట్టడం వలన యురేత్ర నుంచి కిడ్నీలోకి బ్యాక్టీరియా చేరుతుంది.దాంతో ఇంఫెక్షన్లు మొదలవుతాయి.UTIs మాత్రమే కాదు, ఇంకెన్నో ఇంఫెక్షన్స్ ఉంటాయి.మీరు ఎంతసేపు ఆపిపెడితే బ్యాక్టీరియా అంత ఎక్కువ పెరుగుతుంది.బ్యాక్టీరియా ఎంత ఎక్కువ పెరిగితే ఇంఫెక్షన్ అంత ఎక్కువ పెరుగుతాయి.

దాంతో కిడ్నిల పనితనం మందగిస్తుంది.మలినాలు సరిగా బయటకివెళ్ళవు, టాక్సిన్స్ అలానే ఉండిపోతాయి, స్త్రీలలో డిశ్చార్జ్ తో దుర్వాసన రావొచ్చు.

మూత్రం రంగు మారిపోతుంది.చివరకి కిడ్నీ ఫేల్యూర్ దాకా సమస్య వెళ్ళవచ్చు.

అదే జరిగితే ఇక మీ జీవితపు చివరి రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే.

అందుకే ద్రవపదార్థాలను ప్లాన్డ్ గా తీసుకోవాలి.

దూరపు ప్రయాణాలు బస్సుల్లో చేసినప్పుడు, ఆఫీసు మీటింగ్స్ ఉన్నప్పుడు ఎంత తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నామో ఆలోచించాలి.ఎందుకంటే రెండు నిమిషాల కోసం ఆలోచిస్తే, అది మీ ప్రాణాలకే ప్రమాదం.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు