ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా మేనియా కనిపిస్తోంది.దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా( Pushpa 2 ) ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.
మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా జోరు మాత్రం మామూలుగా లేదని చెప్పవచ్చు.రూరల్ మాస్ ఏరియాలో హిందీ ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు.
ఈ సినిమాకు రిలీజ్ ముంగిట హిందీలో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ బీహార్ లోని( Bihar ) పాట్నాలో నిర్వహించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన స్పందన చూస్తేనే కలెక్షన్ల మోత మోగిపోనుందని అర్థమైంది.ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే నార్త్ ఇండియాలో అలాంటి ఈవెంట్ ఒకటి జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

పొలిటికల్ మీటింగ్ లను మించేలా ఆ వేడుకకు స్పందన వచ్చింది.బన్నీ( Bunny ) నార్త్ ఫాలోయింగ్ చూసి మిగతా హీరోలకు కళ్లు కుట్టి ఉంటాయేమో అన్న చర్చలు కూడా జరిగాయి.అయితే బీహార్ ఈవెంట్ మీద తమిళ హీరో సిద్ధార్థ్( Hero Siddharth ) తాజాగా వేసిన పంచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.పుష్ప 2 రిలీజ్ అయిన వారానికే సిద్ధు సినిమా మిస్ యు( Miss You Movie ) విడుదల కాబోతోంది.
అయితే బన్నీ సినిమా ప్రభంజనం కొనసాగిస్తుండగా.మిస్ యు ఏ మాత్రం ప్రభావం చూపిస్తుందో అన్న సందేహాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.పాట్నాలో ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన జనాన్ని చూశారా అని అడిగగా.
సిద్ధు సెటైరిగ్గా స్పందించాడు.

మన దగ్గర కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే జేసీబీ సౌండ్ వినిపించినా జనం గుమిగూడి చూస్తారని, ఇండియాలో జనాన్ని సమీకరించడం పెద్ద విషయం కాదని సిద్ధు అన్నారు.జనం వస్తే సక్సెస్ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగ్ లోనూ జనం ఉంటారని, మరి వాళ్లందరూ గెలిచేస్తున్నారా అని సిద్ధు అన్నారు.రాజకీయ సభలకు జనం వస్తే బీరు, బిరియాని వల్లే అని తాము మాట్లాడుకునే వాళ్లమని ఇండియాలో దేనికైనా జనం వస్తారని జనం గుమికూడడం చాలా చిన్న విషయమని సిద్ధు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా హీరో సిద్దు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఒక విధంగా చెప్పాలంటే సిద్దు మాటలను బట్టి చూస్తుంటే పుష్ప 2 సినిమాను మించి మిస్ యూ సినిమా ఆడుతుందనే ధీమా కనిపిస్తోంది.