సుకుమార్ ( Sukumar )దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప 2.( Pushpa 2 ) భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని అందుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూల సునామీని సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అని బట్టి చూస్తే 1000 కోట్ల మార్కుని ఈజీగా దాటేస్తుంది అనిపిస్తోంది.అది కూడా ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా అందుకోని విధంగా ఫాస్టెస్ట్ 1000 కోట్ల గ్రాస్ అందుకున్న చిత్రంగా కేవలం 6 రోజుల్లోనే రాబట్టి దుమ్ము లేపింది.
అయితే ఇప్పుడు వరకు బాహుబలి 2( Baahubali 2 ) ఫాస్టెస్ట్ 1000 కోట్ల గ్రాసింగ్ సినిమాగా 10 రోజుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

కానీ దానిని నాలుగు రోజులు ముందే టచ్ చేసి అల్లు అర్జున్( Allu Arjun ) చరిత్ర తిరగరాశారు అని చెప్పాలి.ఇలా బాహుబలి సినిమా రికార్డును కూడా తిరగరాసి నాలుగు రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్లను సాధించారు మన పుష్ప రాజ్.ఇక ఈ ఏడాది విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సినిమాలలో ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా అని చెప్పాలి.
అయితే మూవీ మేకర్స్ కూడా పుష్ప 2 వెయ్యి కోట్ల మార్క్ ని దాటేసినట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.

ఇలా మొత్తానికి పుష్ప 2 ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక మర్చిపోలేని ఇతిహాసాన్ని రాసుకుంది అని చెప్పాలి.అయితే ఈ సినిమా ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.అంతే కాకుండా ఇంకా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి.ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే మరొక 20 రోజులు పాటు ఈ సినిమా సక్సెస్ఫుల్గా ప్రదర్శితం అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.