విశ్వక్సేన్( Vishwaksen ).ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు విశ్వక్‌సేన్.ఇటీవల కాలంలో విశ్వక్‌సేన్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్( box office ) వద్ద వరుసగా విజయాలు సాధిస్తున్నాయి.
అదే ఊపుతో ఇప్పుడు మరిన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు విశ్వక్‌సేన్.ప్రస్తుతం లైలా కోసం అనే సినిమాలో నటిస్తున్నారు విశ్వక్సేన్.
ఇది ఇలా ఉంటే తాజాగా హీరో విశ్వక్‌సేన్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ( Anudeep )దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
ఫంకీ అనేది టైటిల్ అని తెలుస్తోంది.

ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు.ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఇది సిద్ధం కానుంది.తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.
నాగ్ అశ్విన్ ( Nag Ashwin )పాల్గొని టీమ్ కు శుభాకాంక్షలు కూడా తెలిపారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా త్వరలోనే రెగ్యులర్ ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది.ఆషికా రంగనాథ్( Ashika Ranganath ) కథానాయికగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే విశ్వక్‌సేన్ విషయానికి వస్తే చివరిగా మెకానిక్ రాకి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.ఈ సినిమాకు ఊహించని విధంగా మిశ్రమ స్పందన లభించడంతో ఈ సినిమా కేవలం కొద్ది రోజులు మాత్రమే థియేటర్ లో సక్సెస్ఫుల్ గా ప్రదర్శితం అయ్యింది.కాగా హీరో విశ్వక్సేన్ ఇప్పుడు మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.