రమ్యకృష్ణ,… నేటి తరం ప్రేక్షకులకు కేవలం శివగామిగా మాత్రమే పరిచయం.కానీ 90 వ దశకం లో స్టార్ హీరోలందరి సరసన నటించి నర్తించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.
వాస్తవానికి ఆమె 1983 లోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.కెరీర్ తొలినాళ్లలో కేవలం అందాల ఆరబోతకే ప్రాముఖ్యత ఇచ్చి, కుర్ర కారు గుండెల్లో ఆరాధ్యతారగా, అందాల దేవతగా ముద్ర వేయించుకుంది.
తెలుగు లో మొదటి సారి భలే మిత్రులు అనే చిత్రంలో నటించింది రమ్య.ఈ చిత్రం హిట్ అవ్వడం తో రమ్యకృష్ణ కు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి.
నాట్య పరమైన చిత్రమైన సంకీర్తన అనే సినిమాలో కూడా నటించిన అది పెద్దగా ఆడలేదు.ఆ తర్వాత అంక్షింతలు అనే మరో చిత్రంలో నటించి విమర్శకులను సైతం మెప్పించింది.
ఆమె కేవలం గ్లామర్ మాత్రమే, కామెడీ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో సైతం నటించారు.
నటనలోకి రాక ముందు రమ్యకృష్ణ ఎంతో మంచి నాట్యకారిణి.
ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.కేవలం నాట్యం మాత్రమే కాదు, టీవీల్లో నాటకాలు కూడా వేసేది.
అప్పట్లో టెలీప్లేలు చాల ఫెమస్ గా ఉండేవి.వీటితో పాటు ఆమె అనేక సినిమాల్లో నటిస్తూ ఏకకాలంలో మూడు భిన్నమైన రోల్స్ చేసారు.
నిజానికి రమ్యకృష్ణకు నృత్యం అంటే ఎంతో ప్రాణం.ఆమె గురువు .వెంపటి చినసత్యం.ఆయన శిష్యరికంలోనే కూచిపూడి నేర్చుకుంది.
భరతనాట్యం మాత్రం ధనంజయ అనే డ్యాన్సర్ వద్ద నేర్చుకుంది రమ్యకృష్ణ.మన దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రమ్యకృష్ణకు చిన్నతనంలోనే లభించింది.
ఆమెకు నటన అంటే కూడా ఎంతో అభిమానం.అందుకే సినిమాల్లో నటించేప్పుడు అవి నాట్య ప్రధాన చిత్రాలు అయితే బాగుండు అని రమ్యకృష్ణ ఎప్పుడు కోరుకునేది.

ఇక ఈ అందాల తార రజినీకాంత్ హీరో గా నటించిన పడయప్పా అనే చిత్రంలో మొదటి సారి ప్రతి నాయిక పాత్రలో చాల పవర్ ఫుల్ రోల్ లో నటించి, ఆమెలోని మరొక యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేసారు.ఇదే చిత్రం తెలుగు లో నరసింహ పేరుతో విడుదల అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది.ఈ చిత్రం ద్వారా ఆమె తనలోనే నాట్య కళను సైతం బయటపెట్టి తన చిరకాల వాంఛ నెరవేర్చుకుంది.తన నాట్యదాహాన్ని తీర్చుకుంది.ఈ చిత్రంలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటనను, నాట్యాన్ని సగటు ప్రేక్షకుడు ఎప్పుడు మర్చిపోలేదు.

కాస్త వయసు పెరుగుతున్న కొద్దీ చేస్తున్న పాత్రల్లో కూడా మార్పు వచ్చింది, ఇక ఆమె క్రియేటివ్ దర్శకుడు అయినా కృష్ణ వంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు రిత్విక్ వంశీ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు.ప్రస్తుతం చెన్నై లో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న రమ్యకృష్ణ కు వినయ అనే ఒక చెల్లి కూడా ఉంది, ఈమె టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కూడా.