చిరంజీవి(Chiranjeevi) లాంటి స్టార్ హీరో ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) లాంటి యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే కలుగుతుంది.
ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు చిరంజీవి చూడనటువంటి ఒక కొత్త లుక్ లో శ్రీకాంత్ ఓదెల అతన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి సినిమా చేసి ప్రేక్షకులను మెప్పిస్తాడనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక దానికి తగ్గట్టుగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలకు సాధ్యం కానీ రీతిలో ఆయన భారీ సినిమాను చేసి సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.అయితే శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) చెప్పిన కథ తనకు బాగా నచ్చడం వల్లే ఒప్పుకున్నానని చిరంజీవి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు.
మరి శ్రీకాంత్ ఓదెల అంత మంచి కథ ఏం చెప్పాడు అంటూ ప్రస్తుతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక తన గత సినిమా అయిన దసర సినిమాను కనక చూసుకున్నట్లయితే ఈ సినిమా పక్కా పల్లెటూరు నేపథ్యంలో తెలంగాణ స్లాంగ్ లో డైలాగులు వస్తుంటాయి.
దాంతో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

కథపరంగా చూసుకున్న ఇందులో పెద్దగా కథ అయితే ఏమీ లేదు.మరి ఎందుకు చిరంజీవి అతనికి ప్రిఫరెన్స్ ని ఇస్తున్నాడు.పూరీ జగన్నాధ్ లాంటి స్టార్ డైరెక్టర్లు సైతం చిరంజీవితో సినిమా చేయాలని చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న కూడా వాళ్లకు రాని అవకాశం శ్రీకాంత్ ఓదెలకు ఎందుకు వచ్చింది అంటే నిజంగా డైరెక్టర్ తనదైన రీతిలో సత్తా చాటుకునే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో చిరంజీవి అతనికి ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి ఆయన చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది…