చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ మూవీలో సల్మాన్.. నార్త్ బాక్సాఫీస్ సైతం షేక్ కావడం పక్కా!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్,( Ram Charan ) బుచ్చిబాబు( Buchibabu ) కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.ఇటీవల మైసూర్ లో తొలి షెడ్యూల్ కూడా ప్రారంభమైంది.

 Salman Khan In Ram Charan Buchi Babu Movie Details, Salman Khan, Ram Charan, Buc-TeluguStop.com

ఆ షూటింగ్ లో హీరో రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి.

ఇకపోతే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ స్టార్ కూడా వినిపించబోతున్నట్టు తెలుస్తోంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆ పాత్రలో సల్మాన్ ఖాన్( Salman Khan ) నటించిన బోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ తో సల్మాన్ కు మంచి అనుబంధం ఉంది.ఆ అనుబంధంతోనే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో( God Father Movie ) నటించిన విషయం తెలిసిందే.

Telugu Buchi Babu, Chiranjeevi, God, Peddi, Ram Charan, Ramcharan, Salman Khan,

ఆ సినిమాకు అసలు పారితోషికమే తీసుకోలేదని అప్పట్లో చిరంజీవి( Chiranjeevi ) కూడా స్వయంగా తెలిపారు.స‌ల్మాన్ ఖాన్ ఎప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చినా, చ‌ర‌ణ్ ఆతిధ్యం ఇస్తుంటాడు.అలానే చ‌ర‌ణ్ ముంబై ఎప్పుడు వెళ్లినా స‌ల్మాన్‌ ని ప‌ల‌క‌రించి వ‌స్తుంటాడు.వీళ్ల మ‌ధ్య అంత‌టి అనుబంధం ఉంది.అయితే ఇప్పుడు అదే ఫ్రెండ్ షిప్‌ తో ఈ సినిమాలో న‌టించ‌డానికి స‌ల్మాన్ ఒప్పుకొంటాడ‌ని చిత్ర‌బృందం గ‌ట్టిగా న‌మ్ముతోంది.అదే జ‌రిగితే ఒక క్రేజీ కాంబోని తెర‌పై చూసే అవ‌కాశం ద‌క్కుతుందని చెప్పాలి.

సంక్రాంతి లోగా ఈ కాంబోపై ఒక అధికారిక ప్ర‌క‌ట‌న రావచ్చని తెలుస్తోంది.కాగా ఈ చిత్రానికి పెద్ది( Peddi ) అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారట.

Telugu Buchi Babu, Chiranjeevi, God, Peddi, Ram Charan, Ramcharan, Salman Khan,

నిజానికి ఇది ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రాసుకొన్న క‌థ‌.కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఎన్టీఆర్ చేయ‌లేక‌పోయాడు.దాంతో చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోసం బుచ్చిబాబు చాలా కాలం వెచ్చించాడు.ఏ.ఆర్‌.రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఒకవేళ ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గనుక నటిస్తే చరణ్ కు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మరి ఈ విషయంపై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube