జుట్టు అధికంగా ముక్కలవుతుందా.. వర్రీ వద్దు ఇలా చెక్ పెట్టండి!

మనలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో హెయిర్ బ్రేకేజ్( Hair breakage ) ఒకటి.ముఖ్యంగా కొందరి జుట్టు అధికంగా ముక్కలు అయిపోతుంటుంది.

 Best Oil To Get Rid Of Hair Breakage , Hair Oil, Latest News, Healthy Ha-TeluguStop.com

పోషకాల కొరత, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను వాడ‌టం, వేడివేడి నీటితో తల స్నానం చేయడం, రసాయనాలు అధికంగా ఉండే షాంపూను వినియోగించడం తదితర కారణాల వల్ల కురులు బలహీనంగా మారతాయి.దీంతో జుట్టు ముక్కలవుతుంటుంది.

ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి తెలియక సతమతం అయిపోతుంటారు.కానీ వర్రీ వద్దు.

ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ తో సులభంగా సమస్యకు చెక్ పెట్టవచ్చు.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Breakage, Care, Care Tips, Fall, Oil, Healthy, Latest, Roots-Telugu Healt

ముందుగా ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక గ్లాసు జార్‌ తీసుకుని అందులో ఒక కప్పు ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు,( Onion slices ) రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి( Curry powder ), వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ పొడి ( Kalonji seeds powder )వేసుకోవాలి.అలాగే ఒక బిర్యానీ ఆకు తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఆయిల్ లో వేసి మూత పెట్టి వారం రోజుల పాటు ఎండలో ఉంచాలి.

వారం రోజుల తర్వాత క్లాత్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకొని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి ఈ ఆయిల్ ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కనీసం 10 నిమిషాలు అయినా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న మరుసటి రోజు మైల్డ్ షాంపూ తో తలస్నానం చేయాలి.

Telugu Breakage, Care, Care Tips, Fall, Oil, Healthy, Latest, Roots-Telugu Healt

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే హెయిర్ బ్రేకేజ్ అనేదే ఉండదు.జుట్టు ఆరోగ్యంగా దృఢంగా మారుతుంది.కురులు ముక్కలవడం అనేది క్రమంగా కంట్రోల్ అవుతుంది.హెయిర్ ఫాల్‌ సమస్య( Hair fall problem ) దూరం అవుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.మరియు జుట్టు చిట్లడం కూడా తగ్గు ముఖం పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube