అరటిపండు ఎలా తింటాం ? తొక్క తీసే.ఆరెంజ్ ఎలా తింటాం? కష్టంగా అనిపించినా సరే, తొక్క తీసే తింటాం.దానిమ్మ అయినా అంతే, ఇంకా చాలారకాల ఫలాలు అంతే.తొక్క తీసే తినడం మనకు అలవాటు.కాని ఇప్పుడు మేము చెప్పబోయే ఫలాలని మాత్రం తొక్క తీయకుండా తినడానికే ప్రయత్నించండి.అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఫలాలపై కెమికల్స్ చల్లుతారు, అలాగే దుమ్ము ధూళి తగిలి ఉంటాయి , కాబట్టి తినేముందు శుభ్రమైన ఫలాలనే తింటున్నామా లేదా గమనించండి.
* ఆపిల్ ని ఎలాగో అధికశాతం తొక్కతో సహా తినేస్తారు అనుకోండి.మీరు కూడా తొక్కతో సహా తింటే, అదే పధ్ధతి కంటిన్యు చేయండి.ఆపిల్ తొక్కలో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది.
* దానిమ్మ ఎంత రుచికరంగా ఉంటుందో, అంతే ఉపయోగకరంగా కూడా ఉంటుంది. దాన్నిమ్మ తొక్కలో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి.మీరు కేవలం రుచిని మాత్రమే కాకుండా, అదనపు లాభాలను కూడా కోరుకుంటే తొక్కతో కానిచ్చేయండి.
* అరటిపండు తొక్క కొన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.దీన్ని తినాలనిపించకపోతే, దంతాలను శుభ్రపరచుకోవడానికి, చర్మాన్నిశుభ్రపరచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.* వాటర్ మిలన్ పీల్ వలన కూడా లాభాలున్నాయి.అధిక బరువు సమస్యకి ఇది ఉపయోగం.
* ఆరెంజ్ లోపలే కాదు, ఆరెంజ్ తొక్కలో కూడా విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.దీన్ని తినాలనిపించకపోతే, స్క్రబ్ లాగా వాడుకోవచ్చు.చర్మాన్ని క్లీన్ చేసుకోవచ్చు.
* బొప్పాయి తొక్కతో టాక్సిన్స్ ని వెళ్ళగొట్టవచ్చు.
అలాగే నిమ్మ తొక్కలో విటమిన్ సి, యాంటిసెప్టిక్ లక్షణాలు ఉంటాయి.