గతేడాది థియేటర్లలో విడుదలైన దేవర మూవీ( Devara ) ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాకు అనిరుధ్( Anirudh ) ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం హైలెట్ గా అయ్యాయనే సంగతి తెలిసిందే.
అనిరుధ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.అయితే దేవర హిట్టైనా అనిరుధ్ ను నమ్మట్లేదా అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోలు అనిరుధ్ ను నమ్మట్లేదా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో దసరా తర్వాత మరో సినిమా తెరకెక్కుతుండగా ది ప్యారడైజ్( The Paradise ) అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

నాని( Nani ) అనిరుధ్ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ కాదు.ఇప్పటికే ఈ కాంబోలో జెర్సీ, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు తెరకెక్కాయి.అనిరుధ్ ది ప్యారడైజ్ తో మళ్లీ ప్రూవ్ చేసుకుంటే ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.నాని వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
నాని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.

న్యాచురల్ స్టార్ నాని రెమ్యునరేషన్ 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.నాని పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.నాని ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నాని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉంది.మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.