ఒక యువకుడు ఎయిర్‌పోర్ట్‌లో పాము( Snake ) ఫొటో పట్టుకుని నిలబడిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.బంధువుల కోసం ఎయిర్‌పోర్ట్‌కి( Airport ) వెళ్లిన ఆ వ్యక్తి, మామూలుగా పేర్లు రాసి పట్టుకునే బోర్డుకు బదులు, ఏకంగా పాము బొమ్మతో దర్శనమిచ్చాడు.
దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
సక్లైన్ హైదర్ (@saqlainhaiider) అనే పాకిస్థానీ ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోను షేర్ చేయడంతో ఇది వైరల్‌గా( Viral ) మారింది.
వీడియోలో సక్లైన్ ఎయిర్‌పోర్ట్‌లో తన బంధువుల కోసం వెయిట్ చేస్తూ, పాము ఫొటోను పైకి ఎత్తి పట్టుకుని చూస్తున్నాడు.బంధువులను( Relatives ) రిసీవ్ చేసుకోవడానికి అతను చేసిన ఈ వెరైటీ పనికి నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు.
అయితే, అతను ఈ వీడియోను కేవలం ఫన్ కోసం మాత్రమే చేసినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.ఇప్పటికే 2.5 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.వేలల్లో లైక్స్, షేర్లు, కామెంట్లతో నెటిజన్లు ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.చాలా మంది యూజర్లు ఈ ఐడియాకు ఫిదా అయిపోగా, మరికొందరు మాత్రం తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఓ యూజర్ కామెంట్ చేస్తూ, “ఇంత కాన్ఫిడెన్స్ లైఫ్‌లో ఉండాలి” అని అన్నాడు.మరో యూజర్ మాత్రం ఫన్నీగా రిప్లై ఇస్తూ, “మరీ అంత నిజం మాట్లాడకూడదు!” అని కామెంట్ చేసింది.ప్రీతి రావత్ అనే యూజర్ మరింత ఫన్ జోడిస్తూ, “బంధువులందరూ ఇలాగే ఉంటారా ఏంటి?” అని ప్రశ్నించింది.ఇక ఇంకొకరు మాత్రం కొంచెం వెటకారంగా రిప్లై ఇస్తూ, “రేపు నీకు కూడా ఇలాంటి స్వాగతం పలకొచ్చు జాగ్రత్త, నువ్వు కూడా ఎవరికో ఒకరికి బంధువువే కదా” అని పంచ్ వేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ నవ్విస్తోంది.చాలా మంది దీన్ని ఒకరిని వెల్కమ్ చేయడానికి చాలా తెలివైన, సరదా మార్గం అని అంటున్నారు.ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న మిగతా వాళ్ల రియాక్షన్స్ చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.చిన్న చిన్న విషయాల్లో కూడా ఫన్ ఉంటుందని ఈ వీడియో మరోసారి ప్రూవ్ చేసింది.