కాలేజీ( College ) అంటే చదువుల గుడి, కానీ ఒక్కోసారి ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి.అలాంటిదే ఒకటి జరిగింది.
ఓ కాలేజీ క్లాస్‌రూమ్‌లోకి ఏకంగా గేదె( Buffalo ) దూసుకొచ్చింది.దీంతో విద్యార్థులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.“ఇదేం చోద్యం, చదువుల గుడిలో గేదె ఎలా వచ్చేసింది బాబోయ్” అంటూ విద్యార్థులు నవ్వుకున్నారు.
ఈ వీడియోను DOABA X08 (@doaba_x08) అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేసింది.
క్లాస్‌రూమ్‌లోకి( Class Room ) బర్రె రావడంతో విద్యార్థులు ఎలా షాక్ అయ్యారో, దాన్ని బయటకు తరిమేందుకు ఎలా పరుగులు తీశారో వీడియోలో చూడొచ్చు.గేటు దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉన్నా ఈ పాడి గేదె కాలేజీలోకి ఎలా వచ్చిందనేది మాత్రం మిస్టరీ.
వైరల్ అవుతున్న వీడియోలో( Viral Video ) ఒక విద్యార్థి ధైర్యంగా గేదెని బయటకు దారి చూపిస్తుంటే, మిగతావాళ్లు ఫోన్లలో వీడియోలు తీస్తూ నవ్వుకున్నారు.గేదె క్లాస్‌రూమ్ బయటకు వెళ్లగానే విద్యార్థులంతా గట్టిగా నవ్వేశారు.వీడియోకి క్యాప్షన్ కూడా అదిరింది: “అడ్మిషన్ కోసం వచ్చిందట” అని సరదాగా రాసుకొచ్చారు.
ఈ వీడియోకి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల వ్యూస్‌కి పైగా వచ్చాయి.నెటిజన్లు కామెంట్ల సెక్షన్‌లో తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.“జ్ఞానం సంపాదించడానికి వచ్చింది, పాఠాలు చెబితే డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది” అని ఒక యూజర్ కామెంట్ చేస్తే, మరొకరు “ఇప్పటినుంచి ‘పశువులకు అక్షరం ముక్క రాదు’ అని ఎవరూ అనలేరు!” అని రాశారు.ఇంకొందరైతే మరింత ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.“మేడమ్‌ని మీతో తీసుకెళ్లండి” అని ఒకరంటే, “అడ్మిషన్ కోసం కాదు, మార్క్ షీట్ కోసం వచ్చి ఉంటుంది.” అని మరొకరు కామెంట్ చేశారు.
ఏదేమైనా, ఈ వీడియో మాత్రం నెటిజన్లకు కావాల్సినంత వినోదాన్ని పంచి పెట్టింది.
ఈ సంవత్సరం వైరల్ అయిన ఫన్నీ వీడియోల్లో ఇది కూడా ఒకటి అనడంలో సందేహం లేదు.