నాగచైతన్య( Naga Chaitanya ) సాయిపల్లవి( Sai Pallavi ) కాంబినేషన్ లో చందూ మొండేటి( Chandoo Mondeti ) డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్( Thandel ) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు తాజాగా సెన్సార్ పూర్తి కాగా ఈ సినిమాకు ఏకంగా సెన్సార్ కట్స్( Censor Cuts ) 13 వరకు చెప్పారని తెలుస్తోంది.
కీలకమైన సీన్స్ లో కట్స్, మ్యూట్స్ చెప్పడం తండేల్ మూవీ టీంకు ఒకింత షాక్ అని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.
ఈ సినిమాలో కొన్ని రియల్ రోల్స్ ఉండటంతో వాళ్ల సంబంధీకుల అనుమతులు సైతం తీసుకున్నారని తెలుస్తోంది.
తండేల్ సినిమాలో జాతీయ జెండాలు చూపించడం, పాక్ రిఫరెన్స్ ఎక్కువగా చూపించడంతో ఈ సినిమాకు సెన్సార్ కట్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.

కేవలం థియేట్రికల్ హక్కులు మాత్రమే ఈ రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.తండేల్ సినిమా ఇప్పటికే ఎన్నో కష్టాలను అధిగమించిందనే సంగతి తెలిసిందే.తండేల్ సినిమా అటు నాగచైతన్య ఇటు సాయిపల్లవి కెరీర్ లకు కీలకం అనే సంగతి తెలిసిందే.నాగచైతన్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా తండేల్ మూవీ నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి.తండేల్ మూవీ విడుదలైన ఎన్ని వారాల తర్వాత ఓటీటీలో రిలీజవుతుందో చూడాలి.చైతన్య సాయిపల్లవి ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.తండేల్ మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ అయితే ఉంది.తండేల్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.