టాలీవుడ్ ఇండస్ట్రీకి జనవరి నెల చాలా కీలకం అని చెప్పాలి.సంక్రాంతి ఇలాంటి పెద్ద సీజన్ వచ్చేది ఈ నెలలోనే కాబట్టి చాలా కీలకం అని చెప్పవచ్చు.
చిన్న చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమాల వరకు చాలా సినిమాలు ఈ పండుగకు విడుదల అవుతూ ఉంటాయి.ప్రతి ఏడాది అలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ కానుకగా కొన్ని సినిమాలు విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
ఈ ఏడాది టాలీవుడ్ హీరో రామ్ చరణ్ , గేమ్ చేంజర్ ( Ram Charan, game changer )సినిమాతో మొదటగా ఎంట్రీ ఇచ్చారు.భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో జనవరి 10న విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

బోలెడన్ని ఆశలతో వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది.బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా చతికిలబడింది.ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా( Daku Maharaj movie ) విడుదల అయింది.బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాతో వరుసగా నాలుగో సూపర్ హిట్ సినిమాను టాక్ తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య బాబు.బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే కలెక్షన్లను సాధించింది.ఇకపోతే ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ పరంగా మంచి విజయం సాధించిన సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా( Sankrantiki vastunnam ) అని చెప్పాలి.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.విడుదలకు ముందే పాటలు జనాల్లోకి వెళ్ళడం, ఫ్యామిలీ ఎలిమెంట్స్, సంక్రాంతి సీజన్.
ఇవన్నీ ఈ సినిమాకి కలిసొచ్చాయి.అయితే ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఊహించలేదు.
ఈ సినిమాల తర్వాత మరో చెప్పుకోదగ్గ సినిమా రిలీజ్ కాలేదు.సుకుమార్ కూతురు గాంధీ తాత చెట్టు సినిమా చేసింది.
ఇదొక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా.టికెట్లు తెగలేదు కానీ అవార్డులు వచ్చే అవకాశం వుంది.
విశాల్ పుష్కర కాలం క్రితం చేసిన మదగజరాజ అనే సినిమా డబ్బింగ్ గా వచ్చింది.సంతానం కామెడీ తప్పితే ఇందలో చెప్పడానికి కొత్త విషయాలు ఏమీ లేవు.
ఫిబ్రవరిలో కూడా కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి.మరి వాటి జాతకం ఎలా వుంటుందో చూడాలి మరి.