అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) త్వరలోనే తండేల్ ( Thandel )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తన కొత్త వైవాహిక జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ వస్తున్నారు.
నాగచైతన్య 2017వ సంవత్సరంలో సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకున్న విడిపోయారు.
ఇలా నాగచైతన్య సమంత విడిపోవడంతో ఈయన తిరిగి శోభిత( Sobhita )ను పెళ్లి చేసుకున్నారు.

శోభితతో రెండు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న నాగచైతన్య తిరిగి ఆమెను గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.ఇక ఈయన వివాహం తర్వాత మొదటిగా తండేల్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు.ప్రస్తుతం తన లైఫ్ చాలా బాగా ఉందని కొత్త లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని తెలియజేశారు.
ఇక శోభిత గురించి మాట్లాడుతూ ఈయన ఆసక్తికరమైన విషయాలు తెలియ చేశారు.

మా పెళ్లి జరిగి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల కాలంలో మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము అయితే పెళ్లి తర్వాత ఇద్దరం కూడా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాము ఇలా ఒకవైపు షూటింగ్ కోసం తమ సమయం కేటాయిస్తూనే మరోవైపు మాకంటూ కూడా కాస్త టైం కేటాయించుకుంటున్నామని ప్రతిదీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.ఇక మా ఇద్దరికీ సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు.ఇక నాకు సంబంధించి ఏ విషయంలోనైనా నేను కాస్త గందరగోళానికి గురైతే తప్పనిసరిగా శోభిత తనకు సలహా ఇస్తుందని వెల్లడించారు.
అన్ని విషయాల్లో సరైన సూచనలు, సలహాలు ఇస్తుంటుంది.తన నిర్ణయాన్ని నేను ఎంతో గౌరవిస్తా.ప్రతీది ఆమె నిర్ణయం తర్వాతే కార్యరూపం దాలుస్తుంది అంటూ తన భార్య గురించి నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.