టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లోనే నటించినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో కళ్యాణ్ దేవ్( Kalyan Dev ) ఒకరు.శ్రీజ రెండో భర్తగా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ దేవ్ తర్వాత రోజుల్లో భార్యతో విడిపోయిన సంగతి తెలిసిందే.
కూతుర్ని మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
కూతురు నవిష్కను( Navishka ) ట్యాగ్ చేస్తూ నెలరోజుల నుంచి కూతురిని మిస్ అవుతున్నానని పేర్కొన్నారు.
కూతుర్ని మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.కళ్యాణ్ దేవ్ చేసిన కామెంట్ల గురించి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.
కళ్యాణ్ దేవ్ కు ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు కూడా రావడం లేదనే సంగతి తెలిసిందే.

కూతుర్ని మిస్ అవుతున్నానంటూ కళ్యాణ్ దేవ్ చేసిన కామెంట్లపై నెటిజన్లు సైతం ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు.కళ్యాణ్ దేవ్, శ్రీజ( Sreeja ) విడిపోవడానికి కారణాలు ఏంటో కూడా తెలియదు.కళ్యాణ్ దేవ్ కు కూతురిపై ఉన్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కళ్యాణ్ దేవ్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

శ్రీజతో పెళ్లికి ముందు కళ్యాణ్ దేవ్ ఎవరికీ పెద్దగా తెలియదు.ఇన్ స్టాగ్రామ్ లో కళ్యాణ్ దేవ్ కు ఏకంగా 3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ దేవ్ తన కూతురికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.
కళ్యాణ్ దేవ్ కు నెటిజన్ల నుంచి కూడా ఊహించని స్థాయిలో సపోర్ట్ దక్కుతుందని చెప్పవచ్చు.కళ్యాణ్ దేవ్ ను అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.