ఈ పండ్లను ఒలిచి తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

శరీరానికి అవసరమైన పోషకాలు అందించడానికి రోజువారి ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలను( Fruits ,vegetables ) చేర్చుకోవడం మంచిది.అందుకే ప్రజలందరూ కూడా తమ రోజు వారి ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలను చేర్చుకుంటారు.

 Do You Peel And Eat These Fruits But Know This , Fruits , Vegetables, Cucumbe-TeluguStop.com

ఇక సీజనల్ ప్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇక కొన్ని పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అనేక రకాల తీవ్రమైన వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితం చేస్తాయి.

ఇక మరికొన్ని పండ్లలోనీ పోషకాలు అయితే చాలా వరకు వాటి తొక్కలోనే ఉంటాయి.

అయితే వాటి పొట్టుని, తొక్కను తీసి తినడం వలన పోషకాల పూర్తి ప్రయోజనాలు మనకు అందవు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం పండ్లు తీసుకునే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.ఈ పోషకాలు పొందడానికి వాటిని సరైన మార్గంలో, సరైన సమయంలో తీసుకోవడం చాలా అవసరం.

అయితే సూర్యాస్తమయం తర్వాత పండ్లు తినకూడదని అధ్యాయనాలలో ఆధారాలు ఉన్నాయి.ఆ సమయంలో తింటే అవి జీవక్రియను ప్రభావితం చేస్తాయి.

చాలామంది ఆపిల్ పండును తొక్క తీసి కూడా తింటూ ఉంటారు.

Telugu Cucumber, Fiber, Fruits, Tips, Potassium, Vegetables-Telugu Health

అయితే ఆపిల్ పండు తొక్కలోనే అనేక రకాల పోషకాలు ఉన్నాయి.ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.ఒలిచిన ఆపిల్( Apple ) తినడంతో పోలిస్తే మనం తొక్కతో తింటే అది 332 శాతం ఎక్కువ విటమిన్ కే, 142 శాతం ఎక్కువ విటమిన్ ఏ, 115 శాతం ఎక్కువ విటమిన్ సి, 20% క్యాల్షియం, 19% పొటాషియం ఉంటుంది.

అందుకే ఆపిల్ పండును ఒలిచి తినకపోవడం మంచిది.కీరదోసకాయను కూడా చాలా మందికి పొట్టు తీసి తినే అలవాటు ఉంటుంది.అయితే అధ్యయనాలలో కీరదోసకాయను పొట్టు తీయకుండా తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని తేలింది.

Telugu Cucumber, Fiber, Fruits, Tips, Potassium, Vegetables-Telugu Health

కీరదోసకాయలో( cucumber ) యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.అలాగే ఇందులో విటమిన్ కే కూడా అధికంగా ఉంటుంది.అందుకే శరీరానికి ఈ పోషకాలను లభించాలంటే పొట్టు తీయకుండా కీర దోసకాయను తినాలి.

మామిడి పండును( Mango fruit ) కూడా తొక్కతో తినడం మరింత ప్రయోజనకరంగా పరిగణిస్తారు.పెద్ద ప్రేగు, రొమ్ము, మెదడు, వెన్నుపాము క్యాన్సర్ ఇలా అనేక ఇతర తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి మామిడికాయ తొక్క సహాయపడుతుంది.

అందుకే మామిడికాయ పండును పొట్టుతో కలిపి తినాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube