తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలం నుంచి కూడా ఇలాంటి మల్టీ స్టారర్ ( Multi Starer ) సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభించేది.
ఇక ఇటీవల కాలంలో కూడా ఎంతోమంది యంగ్ హీరోలు కలిసి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులకు కూడా ఇలా తెరపై ఇద్దరు ముగ్గురు హీరోలను చూడటానికి కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలోనే నాగచైతన్య ( Naga Chaitanya ) కూడా తాజాగా మల్టీ స్టారర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచశారు.
నాగచైతన్య త్వరలోనే తండేల్ ( Thandel ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు మల్టీ స్టారర్ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
మీకు అఖిల్( Akhil ) అలాగే అల్లు అర్జున్ ( Allu Arjun ) ఈ ఇద్దరితో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే కనుక ఎవరితో చేస్తారో అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ తాను ఇదివరకు మనం సినిమాలో అఖిల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను.అందుకే అల్లు అర్జున్ తో తప్పకుండా మల్టీ స్టార్ సినిమా చేస్తాను అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య తన మనసులో కోరికను ఇలా బయటపెట్టారు.ఇలా బన్నీతో కలిసి సినిమా చేయాలని ఉంది అంటూ నాగచైతన్య చెప్పడంతో బన్నీ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే నేడు తండేల్ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు అల్లు అర్జున్ అరెస్టు తర్వాత పాల్గొంటున్నటువంటి మొదట వేడుక కావడంతో ఈ కార్యక్రమం పై అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు.