బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకొంటూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి, యాంకర్ అనసూయ( Anasuya ) ఒకరు.ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పలు సినిమాలలో నటించింది అయితే ఈమెకు రంగస్థలం సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు రావడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా గడుపుతూ ఉన్న అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పేసారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె యూట్యూబర్ నిఖిల్( Youtuber Nikhil )!తో కలిసి పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో సినిమా చేయడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.గతంలో అత్తారింటికి దారేది సినిమాలో తనకు అవకాశం వచ్చిన అదొక పబ్ సాంగ్ కావడంతో తాను రిజెక్ట్ చేసానని తెలిపారు.
కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరు మల్లు( Hari Hara Veeramallu ) సినిమాలో ఓ పాట చేశానని ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈమె మాట్లాడుతూ.షూటింగ్ టైంలో కాస్త సమయం దొరికితే చాలు పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు పట్టుకొని కనిపించేవారు అని తెలిపారు.ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీలు మీటింగ్ అంటూ కాస్త హడావిడిగానే ఉండేవారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ గారిలో చిన్నపిల్లల మనస్తత్వం కనబడుతుందని ఈమె తెలిపారు.పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈయన ఒకే సమయంలో ఒకవైపు సినిమాలు ,మరోవైపు రాజకీయాలు అన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలరు అని ఆశ్చర్యపోతూ ఉంటానని పవన్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.