ప్రస్తుతం సోషల్ మీడియాలో కేరళలో( Kerala ) ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయంపై చాలామంది సెలబ్రిటీలు సైతం స్పందించారు.
తోటి విద్యార్థుల ర్యాగింగ్ కి తట్టుకోలేక కేరళకు చెందిన ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిసి వేస్తోంది.
అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) సైతం స్పందించారు.ఈ మేరకు ఆమె స్పందిస్తూ మండిపడ్డారు.
బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన గురించి తెలిసి తాను షాకైనట్లు చెప్పారు.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.

ఇది 2025 అయినప్పటికీ ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఒక బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు.హేళనగా చూడటం, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది.మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి.
తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు మౌనంగా బాధపడుతూ ఉన్నారు.మనం ఎక్కడ విఫలం అవుతున్నాము.ఈ ఘటనపై సంతాపం తెలియజేయడమే కాదు.కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి.
అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాను.

నిజా నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాను.ఆ విద్యార్థికి న్యాయం జరగాలి.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
అలాగే ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి.అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్ గా నిలవండి అని సమంత తన పోస్టులు రాసుకు వచ్చింది.
ఈ మేరకు ఆమె ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టారు.ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కరెక్ట్ గా చెప్పారు మేడం అలాంటి నిందితులకు గట్టిగా శిక్ష పడాలి ఇంకొకసారి ర్యాగింగ్ చేయాలి అంటే భయపడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జనవరి 15 న చోటు చేసుకున్న ఈ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది.తోటి విద్యార్థుల వేధింపులు, అవమానకర చర్యలు తట్టుకోలేక ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తమ కుమారుడు ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ విద్యార్థి తల్లి ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.దీంతో ఈ ఘటన అందరినీ కలచివేసింది.