వయస్సు పెరగటాన్ని ఎవరు ఆపలేరు.కానీ వయస్సు రీత్యా వచ్చే ఛాయలను మాత్రం ఆపవచ్చు.
కొన్ని జాగ్రత్తలు మరియు ఫ్రూట్స్ తీసుకోవటం ద్వారా వయస్సు రీత్యా వచ్చే మార్పులను ఆపవచ్చు.ఈ ఫ్రూట్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.
ఈ పండ్లను రోజు తీసుకోవటం
ద్వారా ముడతలు,ఫైన్ లైన్స్,గీతలను నివారించి చర్మాన్ని హైడ్రేడ్ గా
ఉంచుతాయి.ఇప్పుడు ఆ పండ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

కివి
కివి పండులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.అందువల్ల ఈ పండ్లను
రెగ్యులర్ గా తీసుకుంటే ముడతలు,గీతలు తొలగిపోతాయి.కివిలో విటమిన్ సి
ఎక్కువగా ఉండుట వలన ప్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది.
దానిమ్మ
దానిమ్మలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మ ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్
చేస్తాయి.దానిమ్మలో ఉండే పోషకాలను కణాలకు అందించటం ద్వారా చర్మాన్ని
టైట్ గా మార్చి.అందంగా, కాంతివంతంగా మారుస్తుంది.

పుచ్చకాయ
పుచ్చకాయలో ఉండే పోషకాలు చర్మాన్ని అవసరమైన పోషణను అందించి ముడతలు త్వరగా
రాకుండా సహాయపడతాయి.పుచ్చకాయలో చర్మానికి అవసరమైన ఎన్నో
విటమిన్స్,మినరల్స్ ఉంటాయి.
అవకాడో
అవకాడోలో చర్మానికి సహాయపడే విటమిన్ ఈ, బితో సహా అనేక పోషకాలు ఉంటాయి.ఇందులో ఉండే పొటాషియం చర్మానికి అవసరమైన వాటర్ బ్యాలెన్స్ చేస్తుంది.
ఇందులో ఉండే గ్లూటాథైయాన్.యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ని ఆలస్యం చేస్తుంది.