ఆరోగ్యపరంగా అత్యంత మేలు చేసే ఆహారాల్లో ఓట్స్( Oats ) ముందు వరసలో ఉంటాయి.ఓట్స్ చాలా ధాన్యాల కంటే ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది.
అలాగే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఓట్స్ లో నిండి ఉంటాయి.ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి, జుట్టు సంరక్షణకు కూడా ఓట్స్ ఉపయోగకరంగా ఉంటాయి.ముఖ్యంగా పల్చటి జుట్టుతో బాధపడేవారికి ఓట్స్ ఒక వరమనే చెప్పుకోవచ్చు.
ఓట్స్ లో ఉండే ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.కేవలం రెండు స్పూన్ల ఓట్స్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే వద్దన్నా కూడా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు లేదా గేదె పాలు( Milk ) వేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి.అరగంట తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్ ను పాలతో సహా వేసుకుని మెత్తగా గ్రౌండ్ చేసుకోవాలి.ఇలా గ్రౌండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ ఓట్స్ మాస్క్‌ను వేసుకుంటే జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్( Hair Growth ) అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
జుట్టు ఎంత పల్చగా ఉన్నాసరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతుంది.అలాగే ఈ ఓట్స్ మాస్క్ హెయిర్ ఫాల్‌ను నివారిస్తుంది.
కురులను సిల్కీగా మరియు స్మూత్ గా సైతం మారుస్తుంది.