తాజాగా దక్షిణాఫ్రికాలో(South Africa) ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.స్టెల్లెన్‌బోష్ పట్టణంలోని ఒక ఇంట్లో పిల్లో కింద(Under the pillow) ఈ విష సర్పం దూరింది.
ఇది కేప్ కోబ్రా(Cape Cobra) జాతికి చెందిన పాము, ఇది కాటేస్తే నేరుగా కాటికి పోవాల్సిందే.అయితే అదృష్టవశాత్తు ఆ ఇంటి యజమానులు ఏ ప్రమాదం జరగకముందుకే పామును గుర్తించారు.
అది చాలా పెద్దగా ఉండటంతో పాటు భయంకరంగా కనిపించడంతో యజమానులు వణికి పోయారు.వెంటనే సర్పాలను పట్టుకునే నిపుణుడు ఎమిల్ రోస్సౌను పిలిచారు.
ఆయన హుటాహుటిన వీరు ఇంటికి వచ్చి సర్పాన్ని జాగ్రత్తగా పట్టుకున్నారు.
సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, ఎమిలే రోసోవ్ అనే స్నేక్ క్యాచర్ బెడ్‌రూమ్‌లోకి (Snake Catcher into the bedroom)వెళ్లి పిల్లోను ఎత్తి చూపించడం మనం చూడవచ్చు, అదే దిండు కింద పెద్ద విష సర్పం ఉంది.ఆయన వెనక్కి జరిగి, కెమెరాను మరొకరికి ఇచ్చి, సర్పాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు.
ఈ పాము మరొక పిల్లో వెళ్లగా, రోసోవ్ దానిని తన చేత్తో పట్టుకున్నారు.ఆయన సర్పాన్ని జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి, ఖాళీ డబ్బాలో వేసి మూసివేశారు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న కేప్ కోబ్రా(Cape Cobra) చాలా ప్రమాదకరమైన పాము.ఇవి చాలా రకాల రంగుల్లో ఉంటాయి.నల్ల, గోధుమ, బేజ్(Black, brown, beige) లేదా పసుపు రంగుల్లో కనిపిస్తాయి.చిన్న పాములు గొంతు భాగంలో నల్లని పట్టీతో ఉంటాయి.ఇవి మోల్ స్నేక్ లేదా బ్లాక్ స్పిట్టింగ్ కోబ్రా అనే ఇతర పాముల లాగానే ఉంటాయి కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు.
కేప్ కోబ్రా దక్షిణాఫ్రికాలో అత్యంత విషపూరితమైన కోబ్రా.దీని విషం చాలా బలంగా ఉండి, నరాల వ్యవస్థను త్వరగా ప్రభావితం చేస్తుంది.దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
కాటు వేస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి యాంటీవెనమ్ తీసుకోవాలి.ఈ పాములు కేప్ ప్రావిన్స్‌లు, ఫ్రీ స్టేట్, నార్త్‌వెస్ట్, దక్షిణ బోట్స్వానా, నమీబియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
కొద్ది రోజుల క్రితమే పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 400,000 మంది చూశారు.ఈ వీడియో చూసిన చాలామంది అదిరిపడుతున్నారు.
అదే దిండుపై తెలియకుండా ఎవరైనా పడుకుంటే పరిస్థితి ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.