యూకేలో( UK ) విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో( Road Accident ) భారత సంతతికి చెందిన విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు.
తూర్పు ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌షైర్‌లో( Leicestershire ) ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో భారతీయ విద్యార్ధి మరణించగా.
మరో నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని పోలీసులు తెలిపారు.మృతుడిని పంగులూరి చిరంజీవి (32)గా( Panguluri Chiranjeevi ) గుర్తించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన ఒక మహిళ, ఇద్దరు పురుషులను ఆసుపత్రికి తరలించినట్లుగా లీసెస్టర్‌షైర్ పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన 27 ఏళ్ల డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.
అనంతరం అతనిని బెయిల్‌పై విడుదల చేశారు.లీసెస్టర్ నుంచి మార్కెట్ హార్బరో( Market Harborough ) వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు.
డాష్ క్యామ్ పరికరాలలో ఏదైనా ఫుటేజ్ వంటివి దొరికితే తమను సంప్రదించి సహకరించాల్సిందిగా పోలీసులు ప్రజలను కోరారు.ప్రమాద సమయంలో కారులో ఉన్న వారంతా భారత్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు( Andhra Pradesh ) చెందినవారేనని జాతీయ వార్తా సంస్ధ పీటీఐ తెలిపింది.
చిరంజీవి స్వస్థలం ప్రకాశం జిల్లా( Prakasam District ) చీమకుర్తి మండలం బూదవాడ.ఇతను 15 నెలల క్రితం ఎమ్మెస్ చేసేందుకు లండన్ వెళ్లగా ఇంతలోనే ఈ దారుణం జరిగింది.కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.చిరంజీవి భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.
ఇదిలాఉండగా.గతేడాది అమెరికాలోని కనెక్టికట్‌లో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో ఓ భారతీయ విద్యార్ధి మరణించిన కేసులో 41 ఏళ్ల మహిళను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు.న్యూ హెవెన్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్ధి అయిన ప్రియాంషు అగ్వాల్ (23) గతేడాది అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనకు సంబంధించిన నవంబర్ 18న జిల్ ఔగెల్లి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ప్రియాంషు అక్టోబర్ 18, 2023న రాత్రి 11 గంటల సమయంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వస్తుండగా కారు ఢీకొట్టింది.
దీంతో అగ్వాల్‌ను హుటాహుటిన న్యూహెవెన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ వారం తర్వాత కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు.