ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో AI సృష్టించిన(AI-created social media) వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.అద్భుతమైన గ్రాఫిక్స్, ఫన్నీ వాయిస్‌ఓవర్‌లతో ఈ వీడియోలు కోట్లాది మందిని ఆకట్టుకుంటున్నాయి.
ఇలాంటి వీడియోల్లో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఇందులో ఫాస్ట్ ఫుడ్ దిగ్గజమైన మెక్‌డొనాల్డ్స్(McDonald’s) థీమ్‌తో ఒక అమ్యూజ్‌మెంట్ పార్క్ క్రియేట్ చేశారు.
అందులో మెక్‌డొనాల్డ్స్‌ని ఒక అద్భుత లోకంగా చూపించారు.బర్గర్లు, ఫ్రైస్‌లతో(burgers ,fries) నిండిన ఈ లోకం ఆహార ప్రియులందరికీ స్వర్గంలా ఉంటుంది.
అయితే, ఇంత అద్భుతంగా ఉన్న ఈ లోకం అంతా కూడా AI సృష్టించినదే! అంటే, ఇది నిజమైన ప్రదేశం కాదు.కానీ, AI సృష్టించినదని తెలియక చాలామంది దీన్ని నిజమైన ప్రదేశమని నమ్మారు.
ఈ వీడియో ఎంత రియలిస్టిక్‌గా ఉందంటే, మనం చూస్తున్నది నిజమేనా, కాదా అని అనుమానించేలా చేస్తుంది.AI సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
AI సృష్టించిన ఈ వీడియో మనల్ని ఒక అద్భుతమైన మెక్‌డొనాల్డ్స్ పార్క్‌లోకి(McDonald park) తీసుకెళ్తుంది.ఇక్కడ శాండ్‌విచ్(Sandwich) ఆకారంలో రైళ్లు, ఫ్రైస్‌లను ఆధారంగా చేసుకున్న రైడ్లు మనల్ని ఆకర్షిస్తాయి.
ఇంతేకాదు, బర్గర్ ఆకారంలో ట్యూబ్‌లలో జారిపోయే వాటర్ స్లైడ్ కూడా ఉంది.మన అందరికీ తెలిసిన రొనాల్డ్ మెక్‌డొనాల్డ్ (Ronald McDonald)కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాడు.
పార్క్ మొత్తం మెక్‌డొనాల్డ్స్ పాపులర్ ‘ఎమ్’ లోగోతో అలంకరించారు.వీడియో చివరలో “మెక్‌డొనాల్డ్స్ పార్క్ ఎక్స్‌పీరియన్స్ నిజంగా ఉంటే ఎంత బాగుండు” అని ఒక క్యాప్షన్ యాడ్ చేశారు.
AI సృష్టించిన మెక్‌డొనాల్డ్స్ పార్క్ వీడియోను ఇప్పటికే 6.5 మిలియన్ల మంది కన్నా ఎక్కువ మంది చూశారు.ఈ వీడియో చూసిన వాళ్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.“AI వీడియోలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి కాబట్టి భయంగా ఉంది” అని ఒకరు అంటే, “ఎంత అద్భుతమైన పార్క్, మెక్‌డొనాల్డ్స్ నిజంగా ఇలాంటి పార్క్ నిర్మించాలి” అని మరొకరు అంటున్నారు.కొంతమంది ఈ పార్క్ నిజమే అనుకున్నారని కూడా చెప్పారు.ఒక ఫుడ్ లవర్ “ఈ పార్క్‌లో ఫ్రైస్‌లు అనంతంగా ఉంటాయి కదా!” అని జోక్ చేశారు.