కలెక్టర్లతో నేడు ,రేపు సదస్సు..  కీలక నిర్ణయాలు తీసుకోనున్న బాబు 

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) ఏపీకి సంబంధించి అనేక నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు.తమ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Babu Will Take Important Decisions In The Conference Today And Tomorrow With The-TeluguStop.com

ఈ మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఇక విషయానికొస్తే నేడు,  రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించనున్నారు. 

Telugu Ap, Babuimportant, Collecters-Politics

ఈ సందర్భంగా ఆరు నెలల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలతో పాటు,  స్వర్ణాంధ్రప్రదేశ్,  విజన్ 2047 డాక్యుమెంట్ ( Swarnandhra Pradesh, Vision 2047 Document )పై  కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు చంద్రబాబు వివరించనున్నారు .రాబోయే నాలుగున్నర ఏళ్లలో ఏ విధంగా పనిచేయాలనే అంశం పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఈరోజు ఉదయం 10.30 గంటలకు సదస్సు ప్రారంభమవుతుంది.మొదటి రోజు ఆర్టిజిఎస్ , వినతుల పరిష్కారం , గ్రామ,  వార్డు సచివాలయాలు,  వాట్సాప్ గవర్నమెంట్ పై ప్రజల్లో సానుకూల దృక్పథం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.అలాగే వ్యవసాయం , పశుసంవర్ధక ,ఉద్యానవనం పౌరసరఫరాలు( Agriculture, Animal Husbandry, Horticulture Civil Supplies ) ,అటవీ ,జల వనరులు,  పంచాయతీరాజ్ వంటి శాఖల పైన చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 వరకు శాంతిభద్రతలపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు.

Telugu Ap, Babuimportant, Collecters-Politics

ఇక రేపు పరిశ్రమలు, ఐటి ,పెట్టుబడులు, విద్యుత్ , మానవ వనరుల రవాణా, రోడ్లు భవనాలు , గృహ నిర్మాణం ,వైద్యం ,ఆరోగ్యం వంటి రంగాలపైన చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.ఇక తరచుగా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తూ , పరిపాలనలో వేగం పెంచేందుకు, ప్రజలకు ప్రభుత్వ పథకాలను మెరుగ్గా అందించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజాప్రతినిధులు , అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

వీటితో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల అమలుపైనా  చర్చించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube