ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా కూడా బాన పొట్టతో కనిపిస్తూ ఉన్నారు.అధిక బరువుతో వయసు తేడాలకుండా ప్రతి ఒక్కరికి కూడా పొట్ట బయటకి కనిపిస్తుంది.
ఇక అధిక బరువు పెరిగాక తగ్గాలనుకున్నవారు ఎన్నో రకాల వ్యాయమాలు చేస్తూ తిప్పలు పడుతుంటారు.అలాగే దానికి తగిన ఫుడ్ కూడా తీసుకుంటున్నారు.
అయినప్పటికీ సరే సాయంత్రం ఏడు గంటల తర్వాత ఈ తప్పులు చేస్తే బరువు తగ్గించే ప్రయత్నాలు అస్సలు ఫలించవు.ఇప్పటి రోజుల్లో చాలామందిలో స్థూలకాయం సమస్య తీవ్రమైన సమస్యగా మారిపోయింది.
అధిక స్థూలకాయం డీలా పడేలా చేయడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది.ఇక గంటల తరబడి జిమ్ లో ఎంత వర్కౌట్ చేసిన, యోగా చేస్తున్న కూడా ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు.

ఈ సమస్యను నివారించాలంటే డైటింగ్ తో పాటు ఈ తప్పులతో కొత్త చిక్కుల్లో పడకుండా ఉండాలి.అయితే ఆ తప్పులు ఏంటంటే.ప్రతి ఒక్కరు కూడా కాఫీ( Coffee ), ఎనర్జీ డ్రింక్స్ లాంటివి కెఫిన్ కలిగిన పానీయాలను తీసుకుంటూ ఉంటారు.అయితే ఇలాంటి పానీయాలు తీసుకోవడం మంచిది కాదు.
ఈ రకమైన పనియాలు నిద్రకు భంగం కలిగిస్తాయి.అలాగే బరువు తగ్గించే ప్రయాణానికి ఆటంకం కలిగిస్తాయి.
అందుకే కెఫిన్ ఉన్న పానీయాలను బదులుగా హెర్బల్ టీ ( Herbal tea )లేదా వెచ్చని నీటిని తీసుకోవడం మంచిది.వీటితో మంచి నిద్ర కూడా వస్తుంది.
ఇక చాలామందికి రాత్రి సమయంలో పండ్లు తినడం అలవాటు ఉంటుంది.అయితే పండ్లు ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు.
కానీ ఇవి పగటిపూట మాత్రమే తినాలి.

రాత్రి ఆలస్యంగా నిద్రపోయే ముందు పండ్లు తినడం జీర్ణ క్రియ( Digestion )లను నెమ్మదిస్తుంది.అలాగే బరువు పెరగడానికి కూడా ఇది కారణమవుతుంది.రాత్రికి ఆలస్యంగా మేల్కొనే అలవాటు నిద్రలేమికి, హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది.
దీంతో బరువు పెరుగుతారు.అయితే బరువు తగ్గడానికి మంచి నిద్ర చాలా అవసరం.
ఇక రాత్రిపూట అధిక కేలరీలు కలిగిన కొవ్వు పదార్థాలను తీసుకోవడం కూడా బరువు తగ్గించే ప్రయాణానికి ఆటంకం కలిగిస్తుంది.అలాంటి ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
ఇది బరువు పెరిగే దానికి దారితీస్తుంది.