పాలస్తీనాకు అనుకూలంగా వ్యాసం.. అమెరికాలో భారతీయ విద్యార్ధిపై సస్పెన్షన్ వేటు

ప్రస్తుతం హమాస్ – ఇజ్రాయెల్ మధ్య ఓ రేంజ్‌లో యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తున్నా ఇజ్రాయెల్( Israel ) మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.

 Mit Suspends Indian-origin Student Over Pro-palestinian Essay In The Magazine De-TeluguStop.com

ఇదిలాఉండగా హమాస్, ఇజ్రాయెల్‌లకు మద్ధతుగా అమెరికాలోని( America ) పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్ధులు నిరసన చేస్తున్నారు.ఇవి కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రహ్లాద్ అయ్యంగార్( Prahlad Iyengar ) అనే భారతీయ విద్యార్ధి .రైటెన్ రివల్యూషన్‌ అనే పత్రికలో పాలస్తీనా అనుకూల వ్యాసం( Pro-Palestine essay ) ప్రచురించినందుకు గాను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)( Massachusetts Institute of Technology ) అతనిని సస్పెండ్ చేసింది.

Telugu Indian Origin, Israel, Magazine, Pacifism, Palestine, Prahlad Iyengar, Pr

సస్పెన్షన్‌తో పాటు అయ్యంగార్‌పై క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా ఎంఐటీ నిషేధం విధించింది.అలాగే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోషిప్‌ను రద్దు చేయడం కూడా చేసింది.ఇలాంటివి హింసను ప్రేరేపిస్తాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.‘ఆన్ పసిఫిజం ’( On Pacifism ) పేరుతో అయ్యంగార్ రాసిన ఈ వ్యాసం హింసాత్మక నిరసనను ప్రోత్సహించేలా ఉందని ఎంఐటీ భావించింది.

ఇందులో పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా (పీఈఎల్‌పీ)కి సంబంధించిన చిత్రాలను చేర్చడం ద్వారా సమస్య మరింత క్లిష్టంగా మారిందని అభిప్రాయపడింది.అలాగే మల్టీడిసిప్లినరీ స్టూడెంట్ మ్యాగజైన్ రిటెన్ రివల్యూషన్‌ను ఎంఐటీ నిషేధించింది.

Telugu Indian Origin, Israel, Magazine, Pacifism, Palestine, Prahlad Iyengar, Pr

మరోవైపు.తన సస్పెన్షన్‌పై ప్రహ్లాద్ అయ్యంగార్ ఘాటుగా స్పందించారు.ఈ నిర్ణయం అమెరికాలో విశ్వవిద్యాలయాలలో వాక్ స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.అయితే అయ్యంగార్ ఈ తరహా సస్పెన్షన్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.గతేడాది పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొనడంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు.అయితే అతనిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఎంఐటీ కోయలిషన్ సహా పలు విద్యార్ధి సంఘాలు నిరసనకు దిగాయి.

ప్రస్తుతానికి అయ్యంగార్‌పై తీసుకున్న నిర్ణయాన్ని అప్పీల్ చేస్తున్నారు.ఎంఐటీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యూనియన్ కూడా క్యాంపస్‌లో ఈ తరహా పరిస్ధితిపై ఆందోళన వ్యక్తం చేసింది.ఎంఐటీ వైఖరి ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.మరోవైపు అయ్యంగార్‌కు మద్ధతుగా డిసెంబర్ 9న కేంబ్రిడ్జ్ సిటీ హాల్‌లో ర్యాలీ జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube