ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.అది జంతువుల సంక్షేమం( Animals Welfare ) గురించి తీవ్ర చర్చలకు దారితీసింది, అలానే ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
ఈ వీడియోలో ఒక వృద్ధుడు( Old Man ) తన దారిన తాను ప్రశాంతంగా వెళ్లిపోతున్న ఆవుపై( Cow ) కర్రతో దాడి చేసినట్లు మనం గమనించవచ్చు.దాడి చేసిన తర్వాత, ఆవు దెబ్బలకు తాళలేక బాగా బాధపడిపోయింది.
నిజం చెప్పాలంటే అది కాస్త బలహీన స్థితిలో ఉంది.కొంత సమయం తర్వాత, ఆ ఆవు లేచి తనని కొట్టిన వ్యక్తిపైనే ఎదురుదాడి చేసింది.
కొమ్ములతో విసురుతూ రెచ్చిపోయింది.వృద్ధుడు గాల్లో ఎగిరేంత గట్టిగా దాని పదునైన కొమ్ములతో కుమ్మేసింది.అయితే ఈ సంఘటనలో గాయపడిన వృద్ధుడికి ఏమైందనే వివరాలు తెలియ రాలేదు ఈ వీడియో ఎక్కడ తీశారనే డీటెయిల్స్ కూడా తెలియదు.కానీ దీన్ని డిసెంబర్ 10వ తేదీన షేర్ చేశారు.
ఇప్పటికే దీనికి వేలల్లో వ్యూస్ లైక్స్ వచ్చాయి.జంతువులకు కూడా నొప్పి తెలుస్తుందని, తమను తాము కాపాడుకునే శక్తి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అనవసరంగా మూగజీవులను హింసిస్తే ఇలాంటి శాస్తే జరిగిద్దని మరి కొంతమంది కామెంట్లు పెట్టారు.
ఈ ఒక్క వృద్ధుడు మాత్రమే కాదు చాలామంది జంతువులను హింసించడానికి అలవాటుపడిపోయారు.వాటికి కూడా బాధ కలుగుతుందని, వాటిని కూడా ప్రేమగా, గౌరవంగా చూడాలని మర్చిపోయారు.ఈ వీడియో జంతువులను ఎలా చూడాలో, ఇతరులకు ఎలాంటి సందేశం ఇస్తున్నామో ఆలోచించమని గుర్తు చేసింది.
ఈ ఘటన చూసిన నెటిజన్లు జంతువుల క్రూరత్వంపై కఠిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.తల్లిదండ్రులు అన్ని జీవుల పట్ల దయ, సానుభూతిని ప్రదర్శించేలాగా పిల్లలను తీర్చిదిద్దాలని కొందరు అన్నారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.