అస్సలు తగ్గేదేలే.. పుష్ప 2 పై వెంకీ మామ క్రేజీ రివ్యూ... ఏమన్నారంటే?

అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక( Rashmika ) హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం పుష్ప 2( Pushpa 2 ).ఈ సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు రూ.294 కోట్లతో మొదలైన వసూళ్ల పుష్ప 2 వసూళ్ల పర్వం అదేస్థాయిలో కొనసాగుతోంది.సౌత్ తో పాటు నార్త్ లోనూ అల్లు అర్జున్ కు రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తున్నాయి.

 Actor Venkatesh Gives Crazy Review On Pushpa 2 Movie Details, Pushpa 2, Allu Arj-TeluguStop.com

ఇక ఈ సినిమా చూడటం కోసం సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.తాజాగా ఈ సినిమాని విక్టరీ వెంకటేష్ చూశారని తెలుస్తుంది.

Telugu Allu Arjun, Devisri Prasad, Pushpa, Pushpa Rule, Rashmika, Sukumar, Venka

ఇలా పుష్ప సినిమాను చూసిన వెంకటేష్ ( Venkatesh ) ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఈ క్రమంలోనే  వెంకటేష్ ఇచ్చిన ఈ రివ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది.పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ఎంతో అద్భుతంగా నటించారు.ఆయన నటన చూస్తూ నా కళ్ళు కూడా పక్కకు తిప్పుకోలేకపోయాను.దేశవ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఇక ఈ సినిమాలో రష్మిక అసాధారణ ప్రదర్శన చేసింది.

Telugu Allu Arjun, Devisri Prasad, Pushpa, Pushpa Rule, Rashmika, Sukumar, Venka

గొప్ప విజయం అందుకున్న డైరెక్టర్ సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు’ అని ప్రశంసలు కురిపించారు.ఇక చివర్లో పుష్ప ట్రేడ్ మార్క్ డైలాగ్ అస్సలు తగ్గేదేలే  అని క్రేజీ ‍క్యాప్షన్ కూడా ఇచ్చారు.ఇప్పటికే ఈ సినిమా విజయం పట్ల ఎంతోమంది సెలబ్రిటీలు వారి అభిప్రాయాలను తెలియజేస్తూ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా విడుదల అయ్యి వారం రోజులు పూర్తి చేసుకుంది.

ఇలా వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనమైన రికార్డులను సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube