ముంబై లాంటి మహానగరాలలో కొందరికి బిక్షగాళ్లకు( Beggars ) నెలకు లక్షల రూపాయల్లో సంపాదిస్తున్నారన్న విషయాలు మనం చాలా సార్లు విన్నాం.ముంబై నగరాలలో నెలకు లక్ష రూపాయలకు పైగా అద్దెలను బిక్షగాళ్లు పొందుతున్నారని కూడా ఇదివరకు వినే ఉన్నాము.
అంతేకాదు వారికి కొంతమందికి ఐఫోన్లు, బెంజ్ కార్లు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ అయ్యాయి.అయితే, ఇలాంటివి చూసి పార్థదేబ్ అనే ఓ బెంగాలీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ యువకుడు తాను కూడా బిక్షగాడిలా మారి రోజుకు ఎంత సంపాదించవచ్చు అని పరీక్షించాలని భావించాడు.
అయితే, అనుకున్నది తడుగని ఓ రోజు బిక్షగాడిలా వేషం వేసుకొని కోల్కత్తా నగరంలో( Kolkata ) రంగంలోకి ఎంటర్ అయ్యాడు.
ఈ నేపథంలో కోల్కతా మహానగరంలో బాగా బిజీగా ఉన్న రోడ్డు చూసుకొని అడుక్కోవడం మొదలుపెట్టాడు యువకుడు.ఇక మొత్తం 24 గంటలపాటు అడుక్కోవాలని( 24 Hours Begging ) ప్రయత్నం చేసిన అతడు మొత్తం ఎక్స్పీరియన్స్ ని ఎనాలసిస్ చేసి దానిని యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకోవడానికి రికార్డు చేసుకునే ఏర్పాట్లు కూడా చేశాడు.అందుకోసం ఓ రోజంతా అతడు వివిధ చోట్ల అడుక్కున్నాడు.
సినిమాల్లో చూపించిన వివిధ ప్రయోగాలు చేస్తూ అడుక్కోవడం మొదలుపెట్టాడు.అయ్యా.
అమ్మ.అంటూ అరుస్తూ రోడ్డుపై వెళ్లే వారిని ఆడుకున్నాడు.
ఇలా మొత్తం 24 గంటల పాటు అడుక్కోన్న తర్వాత అతడి బొచ్చలో 34 రూపాయలు వచ్చాయి.24 గంటలపాటు కష్టపడి అడుక్కోన్న సొమ్మును ఆ తర్వాత ఓ పెద్దవిడకు ఇచ్చేసి నమస్కారం చేసుకున్నాడు.ఇక వీడియో చివర్లో అడుక్కోవడం అంత సులువు కాదని, అది కూడా ఓ స్కిల్ అంటూ చెప్పుకోవచ్చాడు.ఇలా ఆ రంగంలోకి వచ్చి అలా ఆడుకోగానే అందరూ డబ్బులు వేస్తారు అనుకోవడం అమాయకత్వం అంటూ పార్థదేబ్ స్పష్టత ఇచ్చాడు.
మొత్తానికి తన వీడియో ఎక్స్పీరియన్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఇప్పుడు అది కాస్త వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ 24 గంటల బెగ్గింగ్ ఛాలెంజ్ వీడియోని చూసి మీకేమనిపించింది కామెంట్ చేయండి.