గుమ్మడి గింజలు.వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
చాలా మంది వీటిని స్నాక్స్‌గా తింటారు.ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో ఇవీ ఒకటి అనడంలో ఎటు వంటి సందేహము లేదు.
మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాల్షియం, పాస్పరస్, ఫైబర్, విటమిన్ ఎ, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషక విలువలు గుమ్మడి గింజల్లో నిండి ఉంటాయి.అందుకే రెగ్యులర్‌గా డైట్ ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.అనేక జబ్బులను సైతం నివారిస్తాయి.
ముఖ్యంగా అధిక బరువును తగ్గించడంలోనూ, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేయడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలోనూ, జుట్టు రాలడాన్ని తగ్గించి.ఒత్తుగా పెరిగేలా చేయడంలోనూ, చర్మ సౌందర్యానికి ఉపయోగపడే పోషకాలను అందించడంలోనూ, మెదడును చురుగ్గా మార్చడంలోనూ గుమ్మడి గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
అయితే గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.కొందరు తినకూడదు.
ఆ కొందరు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా గుమ్మడి గింజలు రక్త పోటు స్థాయిలను తగ్గిస్తుంది.
ఇది హైబీపీ బాధితులకే వరమే.కానీ, లో బీపీ ఉన్న వారు గుమ్మడి గింజలు తీసుకుంటే రక్త పోటు స్థాయిలో బాగా పడిపోతాయి.
అందుకే లోబీపీ బాధితులు గుమ్మడికి గింజలకు దూరంగా ఉండాలి.
అలాగే మలబద్ధకం సమస్యతో బాధ పడే వారు గుమ్మడి గింజలను చాలా లిమిట్‌గా తీసుకోవాలి.లేదంటే డేంజర్‌లో పడాల్సిందే.ఎందుకంటే, గుమ్మడి గింజల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
అందువల్ల, వాటిని ఓవర్ గా తీసుకుంటే మలబద్ధకం సమస్య మరింత ఎక్కువవుతుంది.ఇక గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలతో తరచూ బాధ పడే వారు కూడా గుమ్మడి గింజలను ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది.
లేదంటే ఆ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.