రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలీ అంటే ఎట్టిపరిస్థితుల్లోనూ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేయరాదు.ఎందుకంటే, రోజులో అతి ముఖ్యమైన భోజనం బ్రేక్‌ఫాస్టే.
ప్రతి రోజు స్కిప్ చేయకుండా బ్రేక్ ఫాస్ట్ చేస్తే.శరీరం, మెదడు ఉల్లాసంగా, ఉత్సాహంగా మారతాయి.
బరువును అదుపులో ఉంచుకోవచ్చు.జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
మానసిక సమస్యలు సైతం దరి చేరకుండా ఉంటాయి.అందుకే ఆరోగ్య నిపుణులు సైతం రోజూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలని సూచిస్తుంటారు.
అయితే బ్రేక్ ఫాస్ట్ విషయంలో చాలా మంది తెలిసో, తెలియకో కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.అవేంటీ.? వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటీ.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా కొందరు బ్రేక్ ఫాస్ట్‌లో పండ్లు తీసుకుని కడుపును నింపుకునే ప్రయత్నం చేస్తారు.కానీ, ఇలా చేస్తే మధ్యాహ్నం వేళలో అవసరమైన దానికంటే ఎక్కువగానే ఆహారం భుజిస్తారు.
దాంతో బరువు పెరుగుతారు.కాబట్టి, బ్రేక్ ఫాస్ట్‌లో పండ్లను అస్సలు తీసుకోరాదు.
అలాగే బ్రేక్ ఫాస్ట్‌లో చక్కెర వేసి తయారు చేసిన ఆహారాలేవి తీసుకోరాదు.ఇటువంటివి తింటే.మళ్లీ కొద్ది సేపటికే ఆకలి వేసేస్తుంది.దాంతో చిరు తిండ్ల వైపు మొగ్గు చూపాల్సి ఉంటుంది.
అందుకే బ్రేక్ ఫాస్ట్‌లో చక్కెర లేకుండా చూసుకోండి.
బ్రేక్ చేయడం ఎంతో ముఖ్యమో.
సరైన టైమ్‌కి చేయడం కూడా అంతే ముఖ్యం.కానీ, చాలా మంది చేసే పొరపాటు పది, పదకొండు గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేస్తారు.
ఇలా చేస్తే మీరు తినాల్సిన దనికంటే ఎక్కువ లాగించేస్తారు.ఫలితంగా కొవ్వు పెరుగుతుంది.
సో.ఎనిమిది గంటలకు లోపే బ్రేక్ ఫాస్ట్‌ను ఫినిష్ చేయాలి.
కొంత మంది ఏదో ఒక కారణం చేత బ్రేక్ ఫాస్ట్‌గా బేకరీ ఉత్పత్తులను తీసుకుంటారు.కానీ, బేకరీ ఉత్పత్తులను తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకే బ్రేక్ ఫాస్ట్‌లో ఎప్పుడూ ప్రోటీన్, ఫైబర్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి.వోట్మీల్, వెజిటబుల్ ఆమ్లెట్, ఓట్స్ ఆమ్లెట్, ఉప్మా, పోహా, దోస వంటివి బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిది.