ఈసారి వసంత పంచమి ఎప్పుడొస్తుంది, ఆరోజు ఏం చేయాలో తెలుసా?

ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి ఐదో తేదీ శనివారం నాడు వస్తుంది.ఆరోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది.జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం శనివారం నాడు తెల్లవారుజాము 03.47 నుంచి మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం 03.46 నిమిషాల వరకు వసంత పంచమి ఉంటుందని ఆ సయంలో పూజలు చేసుకుంటే మంచిదని వివరిస్తున్నారు.అలాగే ఉదయం సూర్యోదయానికి ముందుగాని సూర్యాస్తమయం తర్వాత గాని సరస్వతీ దేవి పూజ చేసుకుంటే మరింత మంచిదట.

 When Is Vasantha Panchami This Time And Do You Know What To Do Today, Aksharab-TeluguStop.com

అలాగే ఆరోజు 3 సంవత్సరాలు నిండిన చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది.చదువుల తల్లి సరస్వతీ దేవి క్షేత్రమైన బాసరలో చేయిస్తే మరింత మంచిది.

అంతే కాదండోయ్ వసంత పంచమి రోజు చేయాల్సిన పూజలు, వ్రతాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వసంత పంచని రోజు ఉదయమే నిద్ర లేచి తలంటు స్నానం చేసి పూజకు ఉపక్రమించాలి.పసుపు వస్త్రంపై సరస్వతీ దేవి విగ్రహాన్ని ఉంచాలి.గంధం, కుంకుమ, పసుపులతో పూజ చేయాలి.

అమ్మవారికి ఇష్టమైన పూలు, ప్రసాదాలు అమ్మవారి ముందు ఉంచి సరస్వతీ దేవి స్తోత్రం చదువుతూ… పూజ చేసుకోవాలి.కుడి చేతితో తెల్ల చందనం లేదా తెలుపు లేదా పసుపు రంగు పువ్వులు అమ్మవారికి సమర్పించాలి.

సరస్వతీ దేవికి తెలుపు మరియు పసుపు రంగు అంటే చాలా ఇష్టం.అందుకే ఆ రంగు పూలు, ప్రసాదం సమర్పిస్తే మంచిదని అంటున్నారు.

Aksharabhyasam , Devotional , god saraswathi , Telugu Devotional , Vasantha Panchami
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube