ఈసారి వసంత పంచమి ఎప్పుడొస్తుంది, ఆరోజు ఏం చేయాలో తెలుసా?
TeluguStop.com
ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి ఐదో తేదీ శనివారం నాడు వస్తుంది.ఆరోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది.
జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం శనివారం నాడు తెల్లవారుజాము 03.47 నుంచి మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం 03.
46 నిమిషాల వరకు వసంత పంచమి ఉంటుందని ఆ సయంలో పూజలు చేసుకుంటే మంచిదని వివరిస్తున్నారు.
అలాగే ఉదయం సూర్యోదయానికి ముందుగాని సూర్యాస్తమయం తర్వాత గాని సరస్వతీ దేవి పూజ చేసుకుంటే మరింత మంచిదట.
అలాగే ఆరోజు 3 సంవత్సరాలు నిండిన చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం చాలా మంచిది.
చదువుల తల్లి సరస్వతీ దేవి క్షేత్రమైన బాసరలో చేయిస్తే మరింత మంచిది.అంతే కాదండోయ్ వసంత పంచమి రోజు చేయాల్సిన పూజలు, వ్రతాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వసంత పంచని రోజు ఉదయమే నిద్ర లేచి తలంటు స్నానం చేసి పూజకు ఉపక్రమించాలి.పసుపు వస్త్రంపై సరస్వతీ దేవి విగ్రహాన్ని ఉంచాలి.
గంధం, కుంకుమ, పసుపులతో పూజ చేయాలి.అమ్మవారికి ఇష్టమైన పూలు, ప్రసాదాలు అమ్మవారి ముందు ఉంచి సరస్వతీ దేవి స్తోత్రం చదువుతూ… పూజ చేసుకోవాలి.
కుడి చేతితో తెల్ల చందనం లేదా తెలుపు లేదా పసుపు రంగు పువ్వులు అమ్మవారికి సమర్పించాలి.
సరస్వతీ దేవికి తెలుపు మరియు పసుపు రంగు అంటే చాలా ఇష్టం.అందుకే ఆ రంగు పూలు, ప్రసాదం సమర్పిస్తే మంచిదని అంటున్నారు.
బహిరంగంగా కొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. సర్ధిచెప్పిన మాజీ టీమిండియా బౌలర్