వచ్చే సంవత్సరం జనవరి 1, 2 తేదీలలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు.
కారణంగా రెండు సంవత్సరాల పాటు వేడుకలను నిర్వహించలేకపోయామన్నారు.ఇప్పటివరకు ఏర్పాటు చేసిన పనులను వచ్చే నెల 26 తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జనవరి 1వ తేదీన తెప్పోత్సవం, రెండు వ తేదీన ముక్కోటి ద్వార దర్శనం ఉంటాయని వెల్లడించారు.
ఈ వైకుంఠ ఏకాదశి కోసం డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో టికెట్లను ప్రారంభించేలా మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
సెక్టార్ల ఏర్పాటు పై ప్రణాళిక ఉండాలని చెప్పారు.పచ్చదనం పరిశుభ్రతకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని కూడా చెప్పారు.అదనపు సిబ్బంది కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఇంకా చెప్పాలంటే భక్తులకు సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిపిఆర్ఓ కు కలెక్టర్ ఆదేశించారు.
జనవరి 1, 2 తేదీల్లో జరిగే ఈ మహా ఉత్సవాలలో పాల్గొనేందుకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నారు.లాంచి ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

రవాణా, వైద్యం, విద్యుత్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తాగు నీటిపై కచ్చితంగా పనులు చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఈ సమావేశంలో తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, మధుసూదన్ రాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, డిపిఓ రామాకాంత్, కొత్తగూడెం ఆర్డిఓ రత్న కళ్యాణి, స్వర్ణలత, ప్రత్యేక అధికారి నాగలక్ష్మి ,డి ఆర్ వో అశోక్ చక్రవర్తి, డిఎంహెచ్వో దయానంద స్వామి ,డిఎంహెచ్ఓ జి.రవిబాబు, ఇరిగేషన్ ఈఈ.రాంప్రసాద్ జిల్లా అగ్ని మాపక అధికారి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.