సాధారణంగా చెప్పాలంటే చాలామందికి తలలో రెండు లేక మూడు సుడులు ఉంటాయి.ఇలా సుడులు ఉండడం ఎప్పటినుంచో చర్చాంశనీయంగా మారింది.
రెండు సుడులు ఉన్నవారు రెండు వివాహాలు చేసుకుంటారని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.దీంతో పెద్దలు సైతం ఒక్కోసారి ఆందోళనకు గురవుతూ ఉంటారు.
తన పిల్లలకు రెండు పెళ్లిళ్లు( Marriages ) అవుతాయేమోనని కంగారు పడతారు.ఇది నిజమేనా? లేక దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీసన్ ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.నిజానికి ప్రపంచ జనాభాలో ఐదు శాతం మందికి రెండు సుడులు ఉన్నట్లు NHGRI అధ్యయనంలో తెలిసింది.

అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే డబుల్ ట్విస్టెడ్ హెయిర్( DOUBLE TWISTED HAIR )ఏర్పడడంలో జన్యున్ ప్రధాన పాత్ర పోషిస్తాయి.వాటి తల్లిదండ్రులకు ఉన్నదాన్ని బట్టి పిల్లలకు కూడా ఈ సుడులు అనేవి ఏర్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.కాబట్టి తలలో రెండు సుడులు అనేవి పురుషులు, మహిళల వారి కుటుంబ సభ్యుల వారసత్వంగా పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి రెండు సుడులు ఉన్నవారు చాలా అరుదుగా కనిపిస్తారు.అయితే ఇందులో అసహజంగా ఏది లేదు.ఇది శరీరం లక్షణం మాత్రమే.కానీ కొన్ని సందర్భాల్లో తలలో రెండు సుడులు ఉన్న కొందరు రెండుసార్లు వివాహం చేసుకుంటారు.

ఇది రెండు సుడులు ఉన్న కారణంగానే జరిగిందని చాలామంది నమ్ముతారు.అయితే దీనిపై కచ్చితంగా ఆధారాలేమీ లేవు.ఇక జ్యోతిష శాస్త్రం( Astrology ) ప్రకారం చెప్పుకుంటే రెండు సుడులు ఉన్నవారు మంచివారు.సూటిగా మాట్లాడతారని, కష్టాల్లో స్పందిస్తారని చెబుతారు.అంతేకాకుండా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వందసార్లు ఆలోచిస్తారని కూడా చెబుతున్నారు.అలాగే తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటారు.
అయితే తలలో రెండు సుడులు ఉంటే రెండు వివాహాలు అవుతాయన్న మాట నిజం కాదని కూడా పరిశోధకులు చెబుతున్నారు.